• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  అన్నీ ఉన్నా అవకాశాలు లేని...

అన్నీ ఉన్నా అవకాశాలు లేని తెలుగు సోయగం!!

By - Tupaki Desk
Update: 2020-08-07 17:09 GMT
ఇదివరకు తెలుగమ్మాయిలు అందాల ఆర‌బోత‌కు దూరంగా ఉంటారు అందుకే వారికి అవకాశాలు రావు అనేవారు. ఒకవేళ అవకాశం వస్తే లైట్ తీసుకునేవారు అని చెప్పుకునేవారు. కానీ ప్రస్తుతం పరిస్థితి అలా లేదు మొత్తం మారిపోయింది. తెలుగు అమ్మాయిలు కూడా సరైన అవ‌కాశం రావాలే కానీ సత్తా చాటడానికి సిద్ధంగా ఉన్నారు. ముంబై నుండి పిలిపించే అందగత్తెలను కూడా బీట్ చేయడానికి వారి అందాలకు మెరుగులు దిద్దుతున్నారు. అలా ఇప్పుడిప్పుడే పాపులర్ అవుతున్న తెలుగు హీరోయిన్ ఈషా రెబ్బా. ఈ భామ సుమంత్ అశ్విన్ హీరోగా తెరకెక్కిన 'అంతకు ముందు ఆ తర్వాత' సినిమాతో టాలీవుడ్ ఇండస్ట్రీలో అడుగు పెట్టింది. ఇక ఫస్ట్ మూవీలోనే తన టాలెంట్ ప్రూవ్ చేసుకొని మెల్లగా అవకాశాలు రాబట్టుకుంటుంది. అమ్మడి కెరీర్ మరీ జోరుగా కాకుండా మెల్లగానే సాగుతుంది. అందంతో పాటు అభినయం ఉన్న ఈ తెలుగు బ్యూటీ తనకు వచ్చిన సినిమాలు చేస్తూ వెళుతుంది. ఆ విధంగానే బందిపోటు, అమితుమీ సినిమాలు చేసింది.

కానీ ఇంతవరకు ఈషాకి కావాల్సిన క్యారెక్టర్ దొరకలేదని చెప్పాలి. తెలుగులో పెద్ద‌గా స‌క్సెస్ కాక‌పోవ‌డంతో త‌మిళ‌నాట కూడా ట్రై చేస్తోంది. మొన్నటి వరకు అందాల ప్రదర్శనకు కాస్త హ‌ద్దులు పెట్టుకున్న ఈషా.. ఇటీవలే ఆ హద్దులన్నీ చెరిపేసింది. ఆఫ‌ర్ల కోసం దేనికైనా సిద్ధ‌మంటూ సిగ్న‌ల్స్ ఇచ్చేస్తోంది. ఆ మ‌ధ్య మాయామాల్ అనే సినిమాలో ఈషా సూప‌ర్ గ్లామ‌ర‌స్ గా క‌నిపించిన విషయం తెలిసిందే. ఇక ఈ మధ్య అందాల డోస్ ఇంకాస్త పెంచేసింది. అన్నీ ఉన్నా కూడా తెలుగ‌మ్మాయికి ఆఫర్స్ రావట్లేదట. తాజాగా అమ్మడు ఓ పోస్ట్ పెట్టింది. ఆ ఫోటోలో అమ్మడు కళ్ళతోనే కుర్ర గుండెలను కదిలిస్తుంది. అలా స్కిన్ టైట్ ప్యాంటు.. టి-షర్టులో ఈ భామ అందాలన్నీ ఆరబోయడంతో కుర్రాళ్ళ మతి పోతుందని కామెంట్స్ చేస్తున్నారు. మొత్తానికి మాయామాల్ బ్యూటీ ఒంపు సొంపులతోనే మాయ చేస్తోంది. చూడాలి మరి త్వరలో బిజీ హీరోయిన్ అవుతుందేమో..!


Tags:    
  • Eesha Rebba 
  • Tollywood 
  • Movie News 
  • Nepotism 

Similar News

అనిరుధ్ పెళ్లిలో స్టెప్పులు.. ఏజ్‌లెస్ హీరోకి కిక్కు ఎక్కెరా!

2026-11-12 02:16 GMT

అందాల ఆమ‌ని స్టార్ హీరోల‌కు దూరంగా!

2026-11-11 22:30 GMT

డేట్ నైట్స్ సీక్రెట్స్ బయటపెట్టిన కియారా-సిద్ధార్థ్!

2026-11-11 19:30 GMT

ఇద్ద‌రు పిల్ల‌ల త‌ల్లిగా సాయిప‌ల్ల‌విపై మ‌రో ప్ర‌యోగం!

2026-11-11 18:30 GMT

టీటీడీ చైర్మ‌న్ రేసులో సినీ ప్ర‌ముఖులు.. !

2026-11-11 18:30 GMT

నువ్వు ఇండస్ట్రీని ఏలుతావు..యంగ్ హీరోపై అట్లీ మైండ్ బ్లాకింగ్ కామెంట్స్!

2026-11-11 17:30 GMT

దేవరకొండ ఫ్యామిలీ.. ఒక్క సినిమా పడితే!

2026-11-11 16:39 GMT

స్టార్ జాతకాన్ని ముందే పసిగట్టిన త్రివిక్రమ్ శిష్యుడు

2026-11-11 16:38 GMT

6 రోజుల్లో 100 కోట్ల క్ల‌బ్.. సౌత్‌లో ఈ ఒక్క‌డికే

2026-11-11 16:37 GMT

వివేక్‌ సాగర్‌కి జరిగిన నష్టం ఇతర మ్యూజిక్‌ డైరెక్టర్స్‌కి పాఠం..!

2026-11-11 16:37 GMT

అనిరుధ్ పెళ్లి సర్ ప్రైజ్.. ఇక సన్ పిక్చర్స్‌తో కొత్త ఎమోషన్

2026-11-11 16:33 GMT

కావ్య మార‌న్‌తో అనిరుధ్ పెళ్లి మొద‌టి ఫోటో

2026-11-11 14:00 GMT

Copyright @2026

Powered by Blink CMS