పవన్‌.. దొరకలేదా? నచ్చలేదా?

Update: 2015-08-08 04:37 GMT
అదే అర్ధం కావట్లేదు ఎవ్వరికీ.. అసలు పవన్‌ కళ్యాణ్‌ ఎవరూ దొరకలేదని ఆమెను సెలక్టు చేశాడా లేకపోతే కావాలనే స్టార్‌ వ్యాల్యూ ఉండాలని ఆమెను తీసుకున్నాడా అనే విషయం మాత్రం ఎవ్వరికీ అర్ధంకాలేదు. అయితే ఈ యవ్వారంపై సెటైర్లు మాత్రం పడిపోతున్నాయ్‌. పదండి అసలు ఈ కథేంటో ఓమారు లుక్కేసుకుందాం...

అప్పట్లో సోనమ్‌ కపూర్‌, ఆ తరువాత దీపికా పదుకొనె.. ఇలాంటి పేర్లన్నీ దాదాపు మాయమైపోయిన తరువాత.. సమంత, కాజల్‌, తమన్నా, లేదండీ మళ్ళీ శృతిహాసనే... వంటి కామెంట్లు కూడా వినా్నం. ఆ తరువాత సడన్‌ గా సీనులోకి అనీషా ఆంబ్రోస్‌ వచ్చిపడింది. అప్పటినుండి క్రిటిసిజమే క్రిటిసిజం. అసలు ఆ అమ్మాయిని హీరోయిన్‌ గా ఎలా తీసుకున్నారండీ బాబూ అంటూ నానా రచ్చ చేశారు కొందరు. ఇక ఆమెను కూడా ప్రాజెక్టు నుండి తప్పించేయడంతో, అసలు దొరక్క దొరక్క హీరోయిన్‌ దొరికితే ఆమెను సాగనంపేశారేటి పవన్‌ సార్‌ అంటూ అభిమానులు హర్టయ్యారు కూడా.  ఆ తరువాత వెంటనే ఓ ముగ్గురు మోడళ్ళను పవన్‌ ఫైనల్‌ చేశాడని, వారిలో ఎవరో ఒకరిని లైను లోకి దించేస్తాడని అనుకున్నాం. అప్పట్లో పంజా సినిమా సారా జేన్‌ డయాస్‌, అంజలీ లవానియా వంటి మోడళ్ళను దించాడుగా, ఇక ఇప్పుడు కూడా అదే రిపీట్‌ చేస్తున్నాడేమో అని అనేసుకున్నాం. కాని కట్‌ చేస్తే సీనులోకి కాజలమ్మాయ్‌ వచ్చేసింది.

తెలుగులో అసలు ఏ హీరోతో అయినా కాని 2 కోట్లు ఇస్తేనే పనిచేస్తా అని చెప్పిన కాజల్‌, ఇప్పుడు పవర్‌ స్టార్‌ అనేసరికి ఏకంగా 50 లక్షల రూపాయల రెమ్యూనరేషన్‌ తీసుకొని పనిచేయడానికి ఒప్పుకున్నట్లు టాక్‌ వినిపిస్తోంది కూడా. అయితే అసలు శృతి, సమంత, రకుల్‌, రాశి వంటి హ్యాపెనింగ్‌ స్టార్లు ఉండగా.. మనోడు కాజల్‌ నే ఎందుకు తీసుకున్నాడు అనేది ప్రశ్నార్ధకం. ఎవరూ దొరక్కా, లేకపోతే నచ్చకా? ఏదేమైనా కాజల్‌ కు ఇది పెద్ద ఛాన్సే.
Tags:    

Similar News