• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  కృష్ణవంశీ సినిమా.....

కృష్ణవంశీ సినిమా.. ఏమైందసలు?

By - Tupaki Desk
Update: 2017-06-12 10:09 GMT
‘గోవిందుడు అందరివాడేలే’ హిట్ కాకున్నా.. కృష్ణవంశీ అంతకుముందు తీసిన సినిమాల్లాగా డిజాస్టర్ అయితే కాలేదు. దీంతో ఆయన కొంచెం కొంచెం కుదురుకునేలాగే కనిపించాడు. ఆ సినిమా పూర్తయిన వెంటనే మళ్లీ తనదైన స్టయిల్లో ‘నక్షత్రం’ అనే సినిమా మొదలుపెట్టి తన అభిమానుల్లో ఆసక్తి రేకెత్తించాడు కృష్ణవంశీ. ఈ సినిమా షూటింగ్ మొదలైన కొన్ని రోజులకే ప్రమోషన్ మొదలుపెట్టి.. జనాల దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేశాడు. మళ్లీ ‘ఖడ్గం’.. ‘సముద్రం’ స్టయిల్లో కృష్ణవంశీ నుంచి ఓ వెరైటీ సినిమా రాబోతోందని అనుకున్నారు జనాలు. ఐతే ఈ సినిమా అనివార్య కారణాల వల్ల వాయిదా ఆలస్యమవుతూ వచ్చి అసలు విడుదలవుతుందా లేదా అన్న సందేహాలు రేకెత్తించింది.

ఐతే గత నెలలో ఉన్నట్లుండి ఈ చిత్రాన్ని వార్తల్లోకి తీసుకొచ్చారు. మేలో రిలీజ్ అంటూ హడావుడి చేశారు. టీజర్ కూడా లాంచ్ చేశారు. కానీ ఆ తర్వాత చప్పుడే లేదు. మే వెళ్లిపోయి జూన్ కూడా వచ్చేసింది. ఇప్పుడు బాక్సాఫీస్ దగ్గర సినిమాల జోరు పెద్దగా కనిపించట్లేదు. పెద్దగా పోటీ లేకుండా సినిమాలు రిలీజ్ చేసుకోవడానికిది మంచి తరుణం. ఈ అవకాశాన్ని ‘నక్షత్రం’ సద్వినియోగం చేసుకోవట్లేదు. ‘ఆరడుగుల బుల్లెట్’ తరహాలోనే దానికీ ఫైనాన్స్ సమస్యలున్నాయని.. అందుకే సినిమాకు మోక్షం కలగట్లేదని అంటున్నారు. ‘నక్షత్రం’ విడుదలై మంచి ఫలితాన్నందుకుంటే.. బాలయ్యతో ‘రైతు’ చేసే అవకాశం దక్కుతుందేమో అని ఆశిస్తున్న కృష్ణవంశీకి సినిమా విడుదలకు నోచుకోకపోతుండటం నిరాశ కలిగిస్తోంది. తన సినిమాకు ఎప్పుడు మోక్షం లభిస్తుందో కృష్ణవంశీకైనా క్లారిటీ ఉందో లేదో మరి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Krishna Vamsi 
  • Nakshatram Movie 
  • Sandeep Kishna 
  • Regina 
  • Telugu NEws 

Similar News

విజయేంద్ర ప్రసాద్.. ఏం చేస్తున్నారు?

2026-11-04 01:30 GMT

ఆప‌రేష‌న్ సింధూర్‌పై పాన్ ఇండియ‌న్ సినిమా.. యువ‌హీరో జాక్‌పాట్!

2026-11-04 00:30 GMT

డిసెంబర్‌లో తెలుగు సినిమాలకు హాలీవుడ్ టెన్షన్!

2026-11-03 23:30 GMT

హాలీవుడ్‌లో ఆర్నాల్డ్- కోలీవుడ్‌లో మ్యాడీ ఇద్ద‌రిదీ ఒకటే బాట‌!

2026-11-03 22:30 GMT

పాన్ ఇండియా సినిమాలకు.. ప్రస్తుత కాలం పనికిరాదా?

2026-11-03 19:30 GMT

ఆ అలవాటే 50 ఏళ్లలో కూడా వచ్చింది..జయసుధ కామెంట్స్ వైరల్

2026-11-03 18:30 GMT

Bigg Boss Telugu 10: ఈ వారం ఎలిమినేట్ అవ్వబోయేది వర్షిణినా?

2026-11-03 18:23 GMT

Bigg Boss Telugu 10: ముకేశ్ హీరో అవుతాడా, లేక జీరో అవుతాడా?

2026-11-03 18:23 GMT

వారణాసి: RRR కంటే 40 రోజులు తక్కువ!

2026-11-03 18:18 GMT

పాన్ ఇండియాను దాటి పాన్ వరల్డ్‌కు.. అన్ని భాషల స్టార్ట్స్ తో కలిసి రాజమౌళి సినిమా!

2026-11-03 18:16 GMT

రామాయ‌ణ (X) కింగ్: ప్రీరిలీజ్ బిజినెస్‌లో ఎవ‌రు ది బెస్ట్?

2026-11-03 18:10 GMT

న్యూజిలాండ్లో వెకేషన్ మోడ్‌లో నవదీప్‌ గ్యాంగ్ సందడి!

2026-11-03 18:09 GMT

Copyright @2026

Powered by Blink CMS