బాహుబలి టార్గెట్టు అదేనా?
రాజమౌళి తీసిన బాహుబలి ప్రపంచస్థాయి సినిమాగా ఖ్యాతిని గడించింది. ఒక ప్రాంతీయ చిత్ర పరిశ్రమలో రూపుదిద్దుకొన్న ఆ సినిమా అంతటి ఖ్యాతిని గడించడం గొప్ప విషయమే. తెలుగు సినిమా చరిత్రలో ఉన్న రికార్డులన్నింటినీ తుడిచేస్తూ గొప్పగా తిరగరాసింది. దగ్గర దగ్గరగా 600 కోట్ల రూపాయలు వసూలు చేసి అత్యధిక వసూళ్లు సాధించిన తొలి మూడు భారతీయ చిత్రాల్లోనే ఒకటిగా నిలిచింది.
అయితే బాహుబలి అసలు లక్ష్యం నెంబర్ వన్ అనిపించుకోవడమేనట. అత్యధిక వసూళ్లు సాధించిన సినిమాగా పీకే లిఖించిన రికార్డుల్ని తుడిచేయాలని బాహుబలి బృందం గట్టిపట్టుదలతో ఉందట. అందుకే ఆ చిత్రాన్ని చైనాలో 6వేల థియేటర్లలో విడుదల చేయాలని నిర్ణయించుకొన్నారు. చైనాలో ఇటీవల భారతీయ చిత్రాలకి మంచి ఆదరణ లభిస్తోంది. ఎటువంటి గ్రాఫిక్ హంగులు లేని పీకేకి సైతం అక్కడ రికార్డు స్థాయిలో వసూళ్లు వచ్చాయి. ఇక ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ పక్కాగా ఉన్న బాహుబలి మరిన్ని వసూళ్లు సాధించగలదని వరల్డ్ సినిమా ట్రేడ్ పండితులు కూడా అంచనా వేస్తున్నారు. అందుకే బాహుబలి బృందం పక్కా ప్లానింగ్స్ తో ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్ మేరకు సినిమాని ఎడిట్ చేయించింది. త్వరలోనే అక్కడ బాహుబలి విడుదల కాబోతోంది. చైనాలో ఊహించనిస్థాయిలో రిజల్ట్ లభిస్తే మాత్రం బాహుబలి2కి మరింత బడ్జెట్ పెంచి మరిన్ని భారీ హంగులతో తీయాలని రాజమౌళి టీమ్ ప్లాన్ చేస్తోందట.