• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  యాంకర్ శ్రీముఖి.. ఒక...

యాంకర్ శ్రీముఖి.. ఒక ఆసక్తికర కథ

By - Tupaki Desk
Update: 2016-10-31 15:30 GMT
డాక్టర్ కాబోయి యాక్టర్ అంటుంటారు.. శ్రీముఖి మాత్రం డాక్టర్ కాబోయి యాంకర్ అంటోంది. డాక్టర్ కావాలన్నది ఆమె కల అట. అందుకోసమే కష్టపడి చదివిందట. కానీ అనుకోకుండా చదువు పక్కనబెట్టేసి యాంకర్ గా మారిపోవాల్సి వచ్చిందని అంటోంది శ్రీముఖి. ఆసక్తికరమైన ఆమె నేపథ్యం.. చదువు సంగతులు.. యాంకర్ అవతారమెత్తడానికి దారి తీసిన కారణాల ఏంటో చూద్దాం పదండి.

శ్రీముఖి అనే పేరు చూసి.. ఆమె తెలుగులో చక్కగా మాట్లాడ్డం చూసి.. తెలుగమ్మాయి అనుకుంటాం కానీ.. ఆమె నార్త్ ఇండియన్ ఫ్యామిలీ అట. తండ్రి ప్రభుత్వ ఉద్యోగి కాగా.. తల్లి బ్యుటీషియన్. వీళ్ల ఫ్యామిలీ చాలా ఏళ్ల కిందటే నిజామాబాద్ వచ్చి సెటిలైంది. మంచి చదువరి అయిన శ్రీముఖి.. పదో తరగతి 95 శాతం మార్కులతో పాసైందట. ఆ తర్వాత డాక్టర్ కావాలన్న లక్ష్యంతో ఇంటర్ చేరి.. ఎంసెట్ కోసం కష్టపడి చదవిందట. ఐతే ఎంబీబీఎస్ సీటుకు అవసరమైన ర్యాంకు రాకపోవడంతో బీడీఎస్ లో చేరింది.

ఐతే బీడీఎస్ సెకండియర్లో ఉండగా ఈటీవీలో ప్రసారమయ్యే హోం మినిస్టర్ కార్యక్రమానికి స్నేహితులతో కలిసి హాజరవడం.. అక్కడ ప్రోగ్రాం డైరెక్టర్ ఆమెను చూసి యాంకర్ గా ట్రై చేయమని అడగడం.. తర్వాత ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడి ఒప్పించడం.. ఈటీవీలో వచ్చే ‘అదుర్స్’ ప్రోగ్రాంకు శ్రీముఖి యాంకరింగ్ చేసి మంచి పేరు సంపాదించడం.. ఆ తర్వాత మరిన్ని ప్రోగ్రాములతో బిజీ అవడం చకచకా జరిగిపోయాయి. మొదట్లో తెలుగు సరిగా రాక ఇబ్బంది పడ్డా.. ఆ తర్వాత పట్టు సాధించింది శ్రీముఖి. ఐతే యాంకర్ గా ఎంత ఎదిగినా.. డాక్టర్ కావాలన్నది తన కల అని.. ఎప్పటికైనా దాన్ని నెరవేర్చుకుంటానని అంటోంది శ్రీముఖి.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Sri Mukhi 
  • Telugu NEws 

Similar News

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

రెండో పెళ్లి కూడా విఫలం..నాలుగేళ్లకే భర్తకు విడాకులు!

2026-11-04 08:02 GMT

అజిత్‌తో జతకట్టనున్న శ్రీలీల.. పూజా వేడుకలో లుక్ వైరల్!

2026-11-04 08:01 GMT

హీరోయిన్ల విషయంలో అదే వివక్ష.. కోట్లు కుమ్మరించే ధైర్యం చేయండి!

2026-11-04 08:01 GMT

ధర్మన్ శ్రీలీల.. ఈ కాంబినేషన్ వెనుక ప్లాన్ ఏంటి!

2026-11-04 07:05 GMT

భార‌తీయ న‌టులంతా జ‌క్క‌న్న ప్రేమ్ లో అది ఎందులో అంటే?

2026-11-04 07:05 GMT

హీరోయిన్ అంటే ఇలా ఉండాలి.. తెలుగు ఇండస్ట్రీని ఇప్పటికీ మర్చిపోలేదు!

2026-11-04 06:03 GMT

స్టార్ హీరోలకు ఫస్ట్ డే మేజిక్.. హీరోయిన్ సినిమాలకు ఆ క్రేజ్ రావాలంటే?

2026-11-04 06:01 GMT

Copyright @2026

Powered by Blink CMS