దీపావళి అయిపోయింది.. ప్రకటన లేదే!

Update: 2018-11-08 05:11 GMT
'నాపేరు సూర్య' సినిమా రిలీజ్ తర్వాత స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటించబోయే చిత్రం ఏంటా అని అభిమానులు కామన్ ఆడియన్స్ చాలా రోజుల నుండి ఎదురుచూస్తున్నారు.  త్రివిక్రమ్ తో ప్రాజెక్టు లాక్ అయిందని.. దీపావళి పండగ సందర్భంగా ఓ ఫార్మల్ అనౌన్స్ మెంట్ ఉంటుందని వార్తలు రావడంతో అందరూ ఆసక్తిగా ఆ ప్రకటన కోసం ఎదురుచూశారు. దీపావళి వచ్చింది.. వెళ్ళింది. కానీ నో ప్రకటన!

అసలేం జరుగుతోంది.. ఎందుకు ఇంకా ప్రకటన రాలేదు?  బన్నీ ఈ సినిమాకు ఒక హిందీ రీమేక్ ను ఎంచుకున్నాడట.  ఆ సినిమా 'సోనూ కే టిటూ కి స్వీటీ'.  ఈ సినిమా తెలుగు రిమేక్ హక్కులను తీసుకుందామని ప్రయత్నిస్తే టీ-సీరిస్ వారు అందుకు ఆసక్తి చూపించడం లేదట. ఈ సినిమా రీమేక్ రైట్స్ కాకుండా నిర్మాణంలో భాగస్వాములం అవుతామని మెలిక పెడుతున్నారట.  అసలే ఈ సినిమాను గీతా ఆర్ట్స్ లో నిర్మించాలని బన్నీ- హారికా హాసిని లో నిర్మించాలని త్రివిక్రమ్ టీమ్ అనుకుంటున్నారు.  ఈ విషయమే ఇంకా ఒక కొలిక్కి రాలేదు. ఒకవేళ వాళ్ళిద్దరూ జాయింట్ వెంచర్ గా నిర్మించేందుకు అంగీకారినికి వచ్చినా ఇప్పుడు రీమేక్ రైట్స్ విషయంలో టీ సీరీస్ వారితో చిక్కొచ్చిపడింది.

ఇక ఈ విషయం తేలేవరకూ ప్రకటన ఉండకపోవచ్చని అంటున్నారు.  ఒకవేళ హిందీ సినిమా కాకుండా వేరే ఫ్రెష్ కథ చూద్దామన్నా దానికి మరికొంత సమయం పట్టే అవకాశం ఉంది మరి అల్లువారు ఏం చేస్తారో.. దానికి గురూజి ఏమంటారో?
Tags:    

Similar News