• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  బాలయ్య సినిమాలో విలన్ గా...

బాలయ్య సినిమాలో విలన్ గా చేయడానికి రెడీ: మోహన్ బాబు

By - Tupaki Desk
Update: 2021-11-05 01:30 GMT
'ఆహా' ఓటీటీకి మరింత ఆదరణ కల్పించడానికిగాను కొత్త ప్రణాళికలను రచించారు .. కొత్త కాన్సెప్ట్ లను డిజైన్ చేశారు. అలాంటివాటిలో ఒకటైన 'అన్ స్టాపబుల్ విత్ ఎన్బీకే'ను ఈ రోజున మొదలుపెట్టేశారు. ఫస్టు ఎపిసోడ్ తోనే ఈ షోను జనంలోకి తీసుకెళ్లాలనే ఆలోచనతో మోహన్ బాబుతో చేయాలనే ఆలోచన బాగుంది. ఎందుకంటే ఏదైనా ఒక విషయాన్ని అడగడానికి బాలకృష్ణ ఎంతమాత్రం సందేహించరు. ఇక ప్రశ్న ఏదైనా తడుముకోకుండా కుండబద్దలు కొట్టినట్టుగా చెప్పడం మోహన్ బాబు నైజం. అందువలన ఈ షో పై ఆసక్తిని కనవరిచినవారి శాతం ఎక్కువే.

బాలకృష్ణ .. మోహన్ బాబు స్టేజ్  పైకి ఎంట్రీ ఇస్తూనే చురుక్కులు .. చమక్కులు మొదలైయ్యాయి. ప్రశ్నలు అడగడంలో బాలయ్య తన సహజమైన దూకుడు చూపిస్తే, మోహన్ బాబు కూడా తన ధాటిని కొనసాగించారు. తన  సినిమాలు ..  రాజకీయ ప్రయాణంతో పాటు తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన అనేక విషయాలను ఈ వేదిక ద్వారా మోహన్ బాబు చెప్పుకొచ్చారు. ఇద్దరి మధ్య ఉన్న చనువు కూడా ఈ ఎపిసోడ్ మరింతగా రక్తికట్టడానికి కారణమైంది.

సాధారణంగా బాలకృష్ణ తెరపై హీరోగా తప్ప కీలకమైన పాత్రల్లో కనిపించడానికి కూడా ఒప్పుకోరు. అలాంటి బాలకృష్ణ .. మోహన్ బాబు మాటను కాదనలేక గతంలో 'ఊ కొడతారా ఉలిక్కి పడతారా' సినిమాలో ఒక ముఖ్యమైన పాత్రను పోషించారు. మోహన్ బాబు ఫ్యామిలీతో ఉన్న స్నేహం కారణంగా ఆ సినిమాలో ఆత్మగా కనిపించడానికి కూడా ఆయన వెనుకడుగు వేయలేదు. అందువల్లనే నేమో, ఆయన హీరోగా చేసే సినిమాలో తాను విలన్ గా చేయడానికి తనకి ఎలాంటి ఇబ్బందీ లేదనీ .. తాను సిద్ధమేనని మోహన్ బాబు ఈ షో ద్వారా స్పష్టం చేశారు. ఇక ఈ ఇద్దరి కాంబినేషన్ ను ఎవరు ఎప్పుడు సెట్ చేస్తారనేది చూడాలి. 
Tags:    
  • Mohan Babu 
  • Unstoppable With NBK 
  • AHA 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

'సీన్' మూవీ రివ్యూ

2026-11-06 07:54 GMT

గార్జియస్ లుక్ లో అందరినీ తన వైపు తిప్పుకున్న శ్రీలీల.. ఔట్ఫిట్ తోనే మాయ చేస్తూ!

2026-11-06 07:51 GMT

రాజకీయాల నుంచి వెండితెరకు అసాధారణ ప్రయాణం!

2026-11-06 07:30 GMT

'సమ్మర్ హాలిడేస్' రివ్యూ

2026-11-06 07:23 GMT

ఫ్లాపుల తర్వాత రామ్ మాస్టర్ ప్లాన్.. 2027లో రెండు సినిమాల రిలీజ్‌కు రెడీ!

2026-11-06 06:30 GMT

సూర్యకు మళ్లీ 30 కోట్ల టార్గెట్

2026-11-06 05:49 GMT

కాజల్‌కు ఈ పార్ట్ 2 కష్టాలేంటి!

2026-11-06 05:49 GMT

కన్నుగీటుతూ కుర్రకారు గుండెల్లో గుబులు పుట్టిస్తున్న జాన్వీ కపూర్!

2026-11-06 05:45 GMT

భారీ బడ్జెట్ అంటే ఈ రెండు బ్యానర్లే గుర్తొస్తున్నాయా!

2026-11-06 05:06 GMT

రామాయణం కలెక్షన్స్.. ఓపెనింగ్స్ ఓకే కానీ!

2026-11-06 05:05 GMT

వారణాసి: ఇక స్ట్రాంగ్‌గా మొదలవ్వాలి!

2026-11-06 05:03 GMT

ఆదిపురుష్, రామాయణం.. తేడా అక్కడే కనిపించింది!

2026-11-06 04:06 GMT

Copyright @2026

Powered by Blink CMS