రీమేక్‌ నెం.4 కు రెడీ

Update: 2020-10-30 04:00 GMT
బాలీవుడ్‌ యంగ్‌ స్టార్ హీరో టైగర్‌ ష్రాఫ్‌ కు బాగి సినిమా మంచి పాపులారిటీని తెచ్చి పెట్టింది. టైగర్‌ రెండవ సినిమాగా బాగిని చేశాడు. ఆ సినిమా వర్షం కు రీమేక్‌ గా రూపొందింది. వర్షం సినిమాను పూర్తిగా మార్చేసి బాగి సినిమాను చేశారు. రెండవ సినిమానే మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో టైగర్‌ కు బాగిపై ఒక ఇష్టం ఏర్పడింది. అందుకే వరుసగా బాగి ప్రాంచైజీలో సినిమాలు చేస్తున్నాడు. ఒక సినిమాకు మరో సినిమాకు సంబంధం లేకున్నా కూడా టైటిల్‌ మాత్రం బాగి 2, బాగి 3 అంటూ పెడుతూ వచ్చాడు. ఇప్పటి వరకు టైగర్‌ చేసిన మూడు బాగిలు కూడా మూడు విభిన్నమైన సినిమాల రీమేక్‌ లు అనే విషయం తెల్సిందే. ఇప్పుడు మరో బాగికి రెడీ అవుతున్నారు.

బాగి 3 తో బాలీవుడ్‌ స్టార్‌ యాక్షన్‌ హీరోగా పేరు దక్కించుకున్న టైగర్‌ ష్రాఫ్‌ అంతకు మించిన యాక్షన్‌ సినిమాగా బాగి 4 ను చేయబోతున్నాడట. ఈ కొత్త ప్రాజెక్ట్‌ ను దర్శక నిర్మాతలు అయిన అహ్మద్‌ ఖాన్‌.. సాజిద్‌ లు ప్రకటించారు. బాగి మూడు సినిమాలకు కూడా భారీ వసూళ్లు నమోదు అయ్యాయి. టాక్‌ తో సంబంధం లేకుండా ఈ సినిమాలు వసూళ్లు దక్కించుకోవడం విశేషం.

టైగర్‌ ష్రాఫ్‌ ను యాక్షన్‌ కింగ్‌ గా నిలపడంతో పాటు యూత్‌ ఆడియన్స్‌ కు కనెక్ట్‌ అయ్యేలా చేసిన బాగి నాల్గవ సినిమా కూడా మరో విజయాన్ని అందుకోవడం ఖాయం అన్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల వారు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. వచ్చే ఏడాదికి ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చేలా ప్లాన్‌ చేస్తున్నారు. బాగి నెం.4 కూడా ఒక సౌత్‌ సినిమాకు రీమేక్‌ అన్నట్లుగా వార్తలు వస్తున్నాయి. ఇది విజయం సాధిస్తే మరిన్ని బాగిలు కూడా వచ్చే అవకాశం లేకపోలేదు.
Tags:    

Similar News