గురు సీన్స్ తెచ్చారా? తీశారా?

Update: 2017-03-21 18:32 GMT
వెంకటేష్ లేటెస్ట్ మూవీ గురు టీజర్ రిలీజ్ అయింది. ఏప్రిల్ 7న రిలీజ్ కానున్న ఈ చిత్రం కోసం ఇప్పటికే ప్రమోషన్స్ స్టార్ట్ చేశారు. తాజాగా విడుదల చేసిన టీజర్ కూడా అమితమైన ఆసక్తిని కలిగించింది. బాక్సింగ్ గురు పాత్రలో వెంకీ సూపర్బ్ గా ఉన్నాడనే టాక్ వచ్చింది.

అయితే.. గురు చిత్రం తమిళ్ మూవీ సాలా ఖద్దూస్ కి రీమేక్ అనే విషయం తెలిసిందే. ఈ సినిమా షూటింగ్ చేస్తున్నపుడే ఓ టాక్ వచ్చింది. ఈ మూవీ కోసం కొన్ని సీన్లను ఒరిజినల్ నుంచి యథతథంగా తీసుకుని డైలాగ్ వెర్షన్ మాత్రమే మారుస్తున్నారని అన్నారు. ఇప్పుడు విడుదల చేసిన టీజర్ చూసి.. అదే నిజం అంటున్నారు పలువురు సినీ అభిమానులు. హీరోయిన్ పై మాత్రమే నడిచే దాదాపు 15 నిమిషాల తీన్స్ ను మళ్లీ తీయలేదని.. ఒరిజినల్ లో ఉన్న సీన్స్ ను యథతథంగా తీసుకున్నారని అనే టాక్ గట్టిగానే వినిపిస్తోంది.

అయితే.. ఇలాంటి కాన్సెప్ట్ బేస్డ్ మూవీలకు రీషూటింగ్ చేయాల్సిన అవసరం ఉండదనే టాక్ కూడా వినిపిస్తోంది. ఇటు వెంకటేష్ నటనకు.. బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకునే పాత్రలో రితిక యాక్టింగ్ కు బోలెడన్ని ప్రశంసలు వస్తుండడంతో.. ఇలాంటి టాక్ ను పట్టించుకోవాల్సిన అవసరం లేదని భావిస్తోందిట గురు టీం.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News