• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ట్రైలర్ టాక్: పవర్ ఫుల్...

ట్రైలర్ టాక్: పవర్ ఫుల్ 'రా' యాక్షన్

By - Tupaki Desk
Update: 2019-03-04 10:20 GMT
పాకిస్తాన్ తో గత సంబంధాలను ఉటంకిస్తూ స్పై తరహా థ్రిల్లర్ మూవీస్ ని తీయడంలో బాలీవుడ్ కు ఎవరు సాటి రారు. గత ఏడాది అలియా భట్ టైటిల్ పాత్రలో ఇలాంటి కథాంశంతో రూపొందిన రాజీ ఘన విజయం సాదించడమే కాక ఏకంగా వంద కోట్లకు పైగా వసూళ్లు తెచ్చి పెట్టి హీరో లేని సినిమా స్టామినాను రుజువు చేసింది. ఆ కోవలోనే వస్తున్న మరో మూవీ రోమియో అక్బర్ వాల్టర్. షార్ట్ ఫాంలో చెప్పుకుంటే రా. జాన్ అబ్రహం టైటిల్ పాత్ర పోషిస్తున్న ఈ మూవీ ఏప్రిల్ 5 న విడుదల కానుంది. దీని ట్రైలర్ ఆన్ లైన్ లో రచ్చ చేస్తోంది.

కంటెంట్ విషయానికి వస్తే 1971 ప్రాంతంలో పాకిస్తాన్ దుశ్చర్యలు మితిమీరుతున్న నేపధ్యంలో అక్కడి రహస్యాలను తెలుసుకునేందుకు రా ఏజెంట్  (జాన్ అబ్రహం)ను అక్కడికి పంపిస్తాడు పై ఆఫీసర్(జాకీ శ్రోఫ్). కన్నతల్లికి ట్రైనింగ్ కు వెళ్తున్నానని అబద్దం చెప్పి ప్రమాదకరమైన శత్రు దేశంలో అడుగు పెడతాడు రోమియో. కాని అడుగడుగు ప్రమాదం పొంచి ఉండే పాకిస్తాన్ లో కఠిన పరీక్షలను తట్టుకుని నిలుస్తాడు. కాని చివరికి పద్మవ్యూహంలో ఇరుక్కుని బయటికి రాలేని పరిస్థితి ఎదురవుతుంది. అదే రోమియో అక్బర్ వాల్టర్ కథ

ట్రైలర్ మొత్తం ఇంటెన్సిటీ తో నింపేశారు. అనవసరమైన తతంగాలు లేకుండా స్ట్రెయిట్ గా చెప్పలకున్న థీమ్ మీద నడిపించినట్టు కనిపిస్తోంది. కెజిఎఫ్ హింది వెర్షన్ లో ఐటెం సాంగ్ చేసిన మౌని రాయ్ ఇందులో హీరొయిన్. రోబీ గ్రేవాల్ దర్శకత్వ ప్రతిభ ఆకట్టుకునేలా సాగింది. కథ మొత్తం అరటిపండు వలిచినట్టు ట్రైలర్ లో చూపించారు అంటే సాలిడ్ కంటెంట్ ఇందులో చాలా ఉందనే విషయం అర్థమైపోతోంది. రా ఏజెంట్ కాబట్టి వివిధ రకాల వేషాల్లో జాన్ అబ్రహాం పరకాయ ప్రవేశం చేసాడు.అద్భుతంగా ఒదిగిపోవడమే కాక సీరియస్ లుక్స్ లో పాత్రకు పర్ఫెక్ట్ గా మ్యాచ్ అయ్యాడు. ట్రైలర్ చూసాక సినిమా మీద ఆసక్తి పెరిగేలా చేసిన రోమియో అక్బర్ వాలర్ సరిగ్గా ఇంకో నెల రోజుల్లో ప్రేక్షకులను పలకరించనుంది


Full View


Tags:    
  • John Abraham 
  • Jackie Shroff 
  • Mouni Roy 
  • RAW Romeo Akbar Walter 
  • RAW Romeo Akbar Walter Movie 
  • RAW Romeo Akbar Walter Trailer 

Similar News

చందమామ..నీకు అంత కోపమా..!

2026-11-04 11:16 GMT

టాలీవుడ్‌లో కనిపించని రామాయణ సందడి?

2026-11-04 10:58 GMT

'మాయ లేడీ' ట్రైలర్: ట్విన్స్ మాయలో హీరోగారి లవ్ కన్ఫ్యూజన్

2026-11-04 10:55 GMT

గ్లామరస్ లుక్స్‌తో మరోసారి హాట్ టాపిక్‌గా మారిన సమంత!

2026-11-04 10:55 GMT

గోల్డెన్ టచ్‌తో బ్లాక్ అవుట్‌ఫిట్.. కీర్తి సురేష్ లుక్‌లో ఆ క్లాసే వేరు!

2026-11-04 10:30 GMT

హీరోగా అల్లు అరవింద్.. హీరోయిన్‌గా జయసుధ.. సినిమా పేరు ఏంటంటే!

2026-11-04 09:15 GMT

సినిమాను బలిపశువును చేయొద్దు.. సందీప్ వంగా

2026-11-04 09:12 GMT

బాడీ బిల్డ‌ర్‌ని పెళ్లాడుతున్న‌ గాయ‌ని.. ఫ్యాన్స్ విషెస్

2026-11-04 08:19 GMT

అజ్ఞాతవాసినే తట్టుకున్న గురుజీకి ఇదొక లెక్క..

2026-11-04 08:15 GMT

800 కోట్ల బ్లాక్‌బస్టర్ తర్వాత ఆఫర్ల వర్షం..అయినా రిజెక్ట్ చేసిన హీరోయిన్!

2026-11-04 08:12 GMT

అవకాశాలు అందుకుని విమర్శలా.. ఎస్కేఎన్ ఘాటైన కౌంటర్!

2026-11-04 08:12 GMT

బెల్లంకొండ శ్రీనివాస్.. మళ్లీ ఆ బలాన్నే నమ్ముకున్నారా!

2026-11-04 08:03 GMT

Copyright @2026

Powered by Blink CMS