సక్సెస్ జోష్ లో రేటు పెంచేసిన స్టార్ హీరో..?
మాస్ మహారాజ్ రవితేజ 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో మళ్ళీ సక్సెస్ ట్రాక్ ఎక్కారు. అంతకముందు రవితేజ నటించిన 'టచ్ చేసి చూడు' 'నేల టికెట్' 'అమర్ అక్బర్ ఆంటోనీ' 'డిస్కో రాజా' వంటి నాలుగు సినిమాలు బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూశాయి. ఈ నేపథ్యంలో ఎలాగైనా ఈసారి హిట్ కొట్టాలని కసితో పని చేసిన మాస్ రాజాకు 'క్రాక్' సాలిడ్ సక్సెస్ అందించింది. ఈ జోష్ లో ఇప్పుడు వరుస ప్రాజెక్ట్స్ కమిట్ అవుతున్న రవితేజ.. తన రెమ్యూనరేషన్ కూడా పెంచేశారని టాక్ వినిపిస్తోంది.
రవితేజ లైనప్ లో ప్రస్తుతం ఐదు క్రేజీ మూవీస్ ఉన్నాయి. అయితే ఒక్కో సినిమాకు దాదాపు ₹18 కోట్ల వరకు తీసుకుంటున్నాడని ఫిలిం సర్కిల్స్ లో ప్రచారం జరుగుతోంది. ఆ మధ్య వరుస ప్లాపులు పలకరించడంతో మాస్ రాజా డిమాండ్ కాస్త తగ్గింది. ఇప్పుడు మళ్లీ ఫార్మ్ లోకి వచ్చారు. 'క్రాక్' సినిమా థియేటర్ తో పాటుగా ఓటీటీ ప్లాట్ ఫార్మ్ లో కూడా సత్తా చాటింది. ఈ నేపథ్యంలో దీన్ని క్యాష్ చేసుకునే క్రమంలో పారితోషికం పెంచేసాడనేది టాక్ ఆఫ్ ది టౌన్. ఇందులో నిజమెంతో తెలియదు కానీ.. రవితేజ నటిస్తున్న చిత్రాల్లో రెండు బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ అయితే మాత్రం స్టార్ హీరో మరో దశాబ్దం పాటు వెనక్కి తిరిగి చూసుకోవాల్సిన అవసరం ఉందని చెప్పవచ్చు.
ఇకపోతే రవితేజ లైన్ లో పెట్టిన సినిమాలన్నీ వేటికవే ప్రత్యేకంగా ఉన్నాయి. రమేష్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న 'ఖిలాడి' సినిమాలో ద్విపాత్రాభినయం చేస్తున్నారు. హై వోల్టేజ్ యాక్షన్ థ్రిల్లర్ గా వస్తున్న ఈ సినిమా షూటింగ్ పూర్తి చేసుకొని రిలీజ్ కు రెడీ అవుతోంది. అలానే శరత్ మండవ తో చేస్తున్న 'రామారావు ఆన్ డ్యూటీ' సినిమా వాస్తవ సంఘటనల ఆధారంగా ఒక స్పెషల్ యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతోంది. ఇందులో రవితేజ ఎమ్మార్యో గా కనిపించనున్నారు.
రవితేజ - త్రినాథరావు నక్కిన కాంబినేషన్ లో రాబోతున్న 'ధమాకా' సినిమా మాస్ అంశాలతో కూడిన కంప్లీట్ ఎంటర్టైనర్ అని తెలుస్తోంది. ఇందులో మాస్ రాజా లాయర్ గా కనిపిస్తారని టాక్. 'దొంగాట' ఫేమ్ వంశీ దర్శకత్వంలో రవితేజ హీరోగా నటిస్తున్న సినిమా 'టైగర్ నాగేశ్వరరావు'. ఇది స్టువర్ట్ పురంలో పేరుమోసిన గజదొంగ నాగేశ్వరరావు బయోపిక్. రవితేజ కెరీర్ లో ఫస్ట్ పాన్ ఇండియా మూవీ. ఇందులో ఆయన రా అండ్ రస్టిక్ లుక్ లో కనిపించనున్నారు. ఇక సుధీర్ వర్మ డైరెక్షన్ లో చేస్తున్న 'రావణాసుర' స్టైలిష్ యాక్షన్ డ్రామా అని తెలుస్తోంది.