మాస్‌ రాజా 'విరాటపర్వం' కాంబో?

Update: 2021-04-08 05:30 GMT
రవితేజ సుదీర్ఘ కాలం తర్వాత 'క్రాక్‌' సినిమాతో సక్సెస్‌ ను దక్కించుకున్నాడు. రవితేజను ఎలా చూడాలనుకుంటున్నామో అలా క్రాక్‌ లో చూపించారంటూ అభిమానులు ఆ సినిమా పై ప్రశంసలు కురిపించారు. దాంతో రవితేజ మరిన్ని మాస్‌ మసాలా సినిమాలను చేసేందుకు ఉవ్విల్లూరుతున్నాడు. ప్రస్తుతం రమేష్‌ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' సినిమాను చేస్తున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చిత్రీకరణ ముగింపు దశకు వచ్చింది. ఇక ఇప్పటికే కమర్షియల్‌ డైరెక్టర్‌ గా పేరు దక్కించుకున్న త్రినాధ రావు నక్కిన దర్శకత్వంలో ఒక సినిమాను చేసేందుకు రవితేజ ఓకే చెప్పాడు. త్వరలోనే ఆ సినిమా పట్టాలెక్కబోతుంది.

ఈ సినిమాలు కాకుండా రవితేజ మరికొన్ని సినిమాలకు కూడా ఓకే చెప్పాడట. ఇటీవల మారుతి దర్శకత్వంలో రవితేజ సినిమా ఉంటుందని వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై ఎలాంటి స్పష్టత లేదు. కాని రవితేజతో 'విరాటపర్వం' సినిమాను నిర్మిస్తున్న సుధాకర్‌ చెరుకూరి ఒక సినిమాను నిర్మించేందుకు సిద్దం అయ్యాడని తెలుస్తోంది. విరాటపర్వం సినిమాతో నిర్మాత సుధాకర్‌ చెరుకూరి టాక్‌ ఆఫ్‌ ది ఇండస్ట్రీ అయ్యాడు. అభిరుచి ఉన్న నిర్మాతగా అంతా ఆయన్ను ప్రశంసిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఆయన రవితేజతో సినిమాకు డేట్లు సంపాదించాడని విశ్వసనీయ సమాచారం అందుతోంది.

ఇటీవలే కొత్త దర్శకుడు రవితేజకు చెప్పిన కథ ఓకే అయ్యింది. ఆ కథతో అదే కొత్త దర్శకుడితో రవితేజ సినిమాను విరాటపర్వం నిర్మాత సుధాకర్‌ చెరుకూరి నిర్మించేందుకు సిద్దం అవుతున్నాడు. త్వరలో సినిమా స్ట్రిప్ట్‌ వర్క్‌ పూర్తి చేసి ఇతర ప్రీ ప్రొడక్షన్‌ వర్క్‌ ను కూడా పూర్తి చేయబోతున్నారు. ఈ సినిమా చిత్రీకరణ ఇదే ఏడాదిలో మొదలయ్యేలా ప్లాన్‌ చేస్తున్నారట. అన్ని అనుకున్నట్లుగా జరిగితే వచ్చే ఏడాది సమ్మర్‌ లోనే రవితేజ 'విరాటపర్వం' కాంబో మూవీ ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.
Tags:    

Similar News