వీళ్లకి సౌదీ శిక్షలు కూడా తక్కువే

Update: 2017-02-21 05:52 GMT
మలయాళ నటి భావన ఉదంతం ఇప్పుడు దక్షిణాది సినీ పరిశ్రమలను కదిలించేస్తోంది. కిడ్నాప్-వేధింపుల దగ్గర మొదలైన ఈ వివాదం.. అనూహ్యంగా భావన పోలీస్ కంప్లెయింట్ ఇవ్వడంతో మలుపు తిరిగింది. దీని వెనక పరిశ్రమలో పెద్ద తలకాయలు ఉన్నాయనే అనుమానాలను పోలీసులు వెలిబుచ్చుతున్నారంటే.. ఇది ఎంతటి సీరియస్ మ్యాటర్ అనే సంగతి అర్ధమవుతుంది.

భావనకు ఎదురైన పరిస్థితిపై నటీనటులు అందరూ సంఘీభావం వ్యక్తం చేస్తున్నారు. టాలీవుడ్ స్టార్ హీరో రవితేజ కూడా ఇదే అంశంపై స్పందించాడు. భావన పేరు ఎత్తలేదు కానీ.. మాస్ మహరాజ్ స్పందన మాత్రం మహిళలపై వేధింపుల అంశంపైనే సాగింది. 'మహిళలపై రేప్.. వేధింపులు లాంటి ఘటనలపై ఎలా స్పందించాలో తెలియక.. నాకు విపరీతంగా కోపం వచ్చేస్తోంది. ఇలాంటి వాటిలో నేరస్తులకు సౌదీ మాదిరి శిక్షలు కూడా సరిపోవు' అంటూ ట్వీట్ చేశాడు రవితేజ.

మాస్ హీరో స్పందనకు.. అన్ని వర్గాల నుంచి మద్దతు లభిస్తోంది. మరోవైపు భావన కేసులో పోలీసుల దర్యాప్తు వేగం పుంజుకుంది. ఇండస్ట్రీ ఊహించని విషయాలు బయటకు వస్తుండడం ఆశ్చర్యం కలిగిస్తోంది.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News