థ్రిల్లర్‌ హిట్‌ బొమ్మ ఓటీటీ అప్‌డేట్‌

బాలీవుడ్‌ లో ప్రతి వారం వరుసగా సినిమాలు అయితే వస్తున్నాయి కానీ ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోతున్నాయి

Update: 2024-05-04 09:14 GMT

బాలీవుడ్‌ లో ప్రతి వారం వరుసగా సినిమాలు అయితే వస్తున్నాయి కానీ ఏ ఒక్క సినిమా కూడా బాక్సాఫీస్ వద్ద సందడి చేయలేక పోతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటికే నాలుగు నెలలు పూర్తి అయ్యాయి. ఈ నాలుగు నెలల్లో బాక్సాఫీస్ వద్ద సందడి చేసిన సినిమాలు చాలా అంటే చాలా చాలా తక్కువ.

ఎట్టకేలకు బాలీవుడ్‌ లో ఓ విజయం నమోదు అయ్యింది. అజయ్ దేవగన్‌, జ్యోతిక ప్రధాన పాత్రల్లో నటించిన షైతాన్‌ అనే సినిమా గత నెల 8న ప్రేక్షకుల ముందుకు వచ్చింది. సినిమాకు రివ్యూవర్స్ నెగిటివ్‌ రివ్యూలు ఇచ్చినా కూడా మౌత్‌ టాక్ తో సినిమా మెల్ల మెల్లగా ఏకంగా ప్రపంచ వ్యాప్తంగా రూ.200 కోట్ల వసూళ్లను నమోదు చేసింది అంటూ సమాచారం అందుతోంది.

ఇండియాలోనే రూ.150 కోట్ల వసూళ్లను షైతాన్‌ వసూళ్లు నమోదు చేసింది అంటే ఏ స్థాయిలో ఈ సినిమా సక్సెస్ అయ్యిందో అర్థం చేసుకోవచ్చు. మౌత్‌ టాక్ తో హిట్‌ అయిన ఈ సినిమాను థియేట్రికల్‌ స్క్రీనింగ్‌ మిస్‌ అయిన వారు, వీలు పడని వారు ఓటీటీ స్ట్రీమింగ్‌ కోసం వెయిట్‌ చేస్తున్నారు.

సినిమా విడుదల అయ్యి నాలుగు వారాలు అవ్వబోతున్న నేపథ్యంలో ప్రముఖ ఓటీటీ నెట్‌ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్‌ కు రెడీ అయ్యింది. ఇంగ్లీష్ సబ్ టైటిల్‌ తో ఈ సినిమాను ప్రపంచ వ్యాప్తంగా స్ట్రీమింగ్‌ చేయబోతున్నారు. ప్రస్తుతానికి హిందీ ఆడియోతోనే సినిమా అందుబాటులో ఉంటుంది.

రాబోయే రోజుల్లో సౌత్‌ భాషల్లో కూడా షైతాన్‌ ను నెట్‌ ఫ్లిక్స్ ప్రేక్షకుల ముందుకు తీసుకు రాబోతున్నట్లుగా హిందీ మీడియా వర్గాల ద్వారా సమాచారం అందుతోంది. జ్యోతిక ఈ సినిమాతో బాలీవుడ్‌ లో మరింత బిజీ అవ్వబోతుందని సినీ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

Tags:    

Similar News