కమర్షియల్ డైరెక్టర్ ను వెయిటింగ్‌ లో ఉంచిన రవితేజ

Update: 2021-04-04 03:57 GMT
రవితేజ ఎట్టకేలకు 'క్రాక్‌' సినిమాతో సక్సెస్‌ ట్రాక్ ఎక్కాడు. ఈ ఏడాది సంక్రాంతికి వచ్చిన క్రాక్‌ సూపర్‌ హిట్‌ అయిన నేపథ్యంలో ఆయన వరుసగా సినిమాలు చేసేందుకు సిద్దం అయ్యాడు. క్రాక్‌ సినిమా సమయంలోనే త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమా ను చేసేందుకు రవితేజ ఓకే చెప్పాడు. కాని అనూహ్యంగా ఆ సినిమా పక్కకు పెట్టి రమేష్‌ వర్మ దర్శకత్వంలో 'ఖిలాడీ' సినిమాను రవితేజ చేస్తున్నాడు. రవితేజ 'ఖిలాడీ' సినిమా ముగింపు దశకు వచ్చింది. అయినా ఇప్పటి వరకు కూడా త్రినాధరావు నక్కిన దర్శకత్వంలో సినిమాకు రవితేజ డేట్లు ఇవ్వలేదు అనే టాక్‌ వినిపిస్తుంది.

ప్రస్తుతం ఖిలాడీ పనుల్లో బిజీగా ఉన్న రవితేజ ఇంకా కూడా త్రినాధరావును వెయిటింగ్ లోనే ఉంచినట్లుగా తెలుస్తోంది. సమ్మర్‌ చివర్లో వీరి కాంబో పట్టాలెక్కే అవకాశం ఉందంటున్నారు. కమర్షియల్‌ దర్శకుడిగా మంచి పేరు దక్కించుకున్న త్రినాధరావు నక్కిన 2018 లో హలో గురూ ప్రేమ కోసమే సినిమా తర్వాత మరే సినిమాను మొదలు పెట్టలేదు. అప్పటి నుండి రవితేజ ఈ దర్శకుడిని వెయిటింగ్‌ లోనే ఉంచాడు అంటున్నారు. ఈ ఏడాదిలో అయినా వీరి కాంబో మూవీ పట్టాలెక్కి ప్రేక్షకుల ముందుకు వస్తుందేమో చూడాలి.
Tags:    

Similar News