ఇప్పటికీ రాజా రేటు తగ్గించట్లేదు

Update: 2017-10-22 05:13 GMT
హీరోలు రెమ్యూనరేషన్ తగ్గించుకోకపోతే ఏమవుతుంది? ఖచ్చితంగా సినిమాలను నిర్మించే బడ్జెట్ పెరుగుతుంది. దాని వలన ఏ సినిమా అయినా కూడా కాస్ట్ ఫెయిల్యూర్ అయిపోతుంది. ముఖ్యంగా మిడిల్ రేంజ్ హీరోల సినిమాలు ఇదే తరహాలో బాక్సాఫీస్ దగ్గర కొట్టుకుపోతున్నాయి.

ఈ మధ్య కాలంలో కొంతమంది యంగ్ హీరోల సినిమాలు ఓవర్ కాస్ట్ అవ్వడం వలనే బాక్సాఫీస్ దగ్గర ఆడలేదు. ఇప్పుడు రవితేజ చేసిన 'రాజా ది గ్రేట్' కూడా 30 కోట్లకు అమ్మితే.. సినిమా లాంగ్ రన్ లో 20 కోట్లు షేర్ తెస్తుందేమో అంటున్నారు ట్రేడ్ వర్గాలు. అయితే ఈ సినిమాకు పెట్టిన బడ్జెట్ లో అత్యంత వాటా మాత్రం రవితేజ రెమ్యూనరేషన్ కే వెళిపోయింది అనేది టాక్. అవతల వరసపెట్టి 25 కోట్ల సినిమాలను డెలివర్ చేస్తున్న నాని కూడా 5 కోట్లు మాత్రమే అడుగుతుంటే.. రవితేజ మాత్రం నాకు 8 కోట్లు కావాలంటూ డిమాండ్ చేస్తున్నాడట. అసలు రెమ్యూనరేషన్ డిస్కషన్ల కారణంగానే రాజా ది గ్రేట్ మొదలవ్వడం లేటైంది. ఇప్పుడు కొత్త ప్రొడ్యూసర్లు ఎవరు ఎప్రోచ్ అయినా కూడా.. రవితేజ అదే రేంజులో కోట్ చేస్తున్నాడటని టాక్.

దాని బదులు అసలు రవితేజ ఏదన్నా ఒక ఏరియా రైట్స్ తీసుకోవచ్చు కదా? అలా చేస్తే సినిమా మేకింగ్ ఖర్చులు చాలా తగ్గిపోతాయ్. పంపిణీదారులకు కూడా సినిమాను తక్కువ రేటుకే విక్రయించవచ్చు. అప్పుడు యావరేజ్ గా ఆడినా కూడా సినిమా వర్కవుట్ అవుతుంద. మరి రవితేజకు ఇవన్నీ పడతాయా? చూద్దాం.



Tags:    

Similar News