పిక్ టాక్ : బ్లాక్ లో ఇస్మార్ట్‌ బార్బీ డాల్‌

తాజా ఫోటో షూట్‌ లో బ్లాక్ డ్రెస్ లో బార్బీ డాల్‌ గా కన్నుల విందు చేస్తుంది. వైట్ స్కిన్‌ టోన్‌ తో బార్బీ డాల్‌ మాదిరిగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

Update: 2024-05-07 02:45 GMT

సవ్యసాచి సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నిధి అగర్వాల్‌ కెరీర్ ఆరంభంలోనే మంచి సినిమాల్లో నటించే అవకాశం దక్కించుకుంది. కానీ అదృష్టం కలిసి రాకపోవడంతో ఈ అమ్మడికి సక్సెస్‌ లు పడలేదు. ఇస్మార్ట్‌ శంకర్‌ సక్సెస్‌ అయినా కూడా అది కెరీర్‌ కి పెద్దగా ఉపయోగపడలేదు అనేది కొందరి అభిప్రాయం.

 

ఈ మధ్య మళ్లీ సినిమాలతో బిజీ అయ్యేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పవన్ కళ్యాణ్‌ హీరోగా రూపొందుతున్న హరి హర వీరమల్లు సినిమా లో హీరోయిన్ గా నిధి అగర్వాల్‌ నటిస్తున్న విషయం తెల్సిందే. ప్రభాస్ తో కలిసి రాజా సాబ్‌ సినిమాను కూడా ఈ అమ్మడు చేస్తున్నట్లు ఇటీవలే ప్రకటన వచ్చింది.

 

అవే కాకుండా మరో రెండు మూడు క్రేజీ ప్రాజెక్ట్‌ ల్లో కూడా ఈ అమ్మడు నటిస్తోంది. వరుసగా సినిమాల్లో నటిస్తున్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తోంది. తాజా ఫోటో షూట్‌ లో బ్లాక్ డ్రెస్ లో బార్బీ డాల్‌ గా కన్నుల విందు చేస్తుంది. వైట్ స్కిన్‌ టోన్‌ తో బార్బీ డాల్‌ మాదిరిగా ఉందంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

బ్లాక్‌ డ్రెస్ లో సాధారణంగానే ఇస్మార్ట్‌ బ్యూటీ నిధి అగర్వాల్‌ ఆకట్టుకుంటూ ఉంటుంది. అలాంటిది ఈసారి అంతకు మించి అన్నట్లుగా బార్బీ లుక్ లో బ్లాక్ డ్రెస్ లో కన్నుల విందు చేసి మెప్పించింది. ఆకట్టుకునే అందం ఈ అమ్మడి సొంతం అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తుంది.

Tags:    

Similar News