మంచి కథ వస్తే కాదనను!

తాజాగా ప్రీతి జింటా తాను ఖచ్చితంగా తెలుగు సినిమా చేస్తాను అంటూ ప్రకటించింది.

Update: 2024-05-07 01:30 GMT

పాతిక సంవత్సరాల క్రితం టాలీవుడ్‌ లో ప్రేమంటే ఇదేరా, రాజ కుమారుడు సినిమాల్లో నటించి మెప్పించిన సొట్ట బుగ్గల సుందరి ప్రీతి జింటా ఆ తర్వాత తెలుగు లో కనిపించలేదు. బాలీవుడ్‌ లో స్టార్‌ హీరోయిన్‌ గా వెలుగు వెలిగింది. అయిదు పదుల వయసుకు చేరువ అయిన ఈమె కెరీర్ లో కాస్త స్లో అయ్యింది.

ఈ మధ్య కాలంలో సినిమాలతో కంటే ఎక్కువగా ఐపీఎల్‌ మ్యాచ్ లు మరియు ఇతర సోషల్‌ మీడియా ఫోటో షూట్స్ కారణంగా వార్తల్లో నిలుస్తోంది. ఎప్పుడో పాతిక సంవత్సరాల క్రితం తెలుగు సినిమా చేసిన ఈ అమ్మడిని తెలుగు ప్రేక్షకులు ఇంకా కూడా అభిమానిస్తూనే ఉంటారు.

తెలుగు లో సినిమాలు చేసిన హీరోయిన్ అంటూ ప్రీతి జింటాను అభిమానించే వారు ఇంకా చాలా మంది ఉన్నారు. వారు మళ్లీ ప్రీతి జింటా తెలుగు లో నటిస్తే బాగుండు అని ఎదురు చూస్తున్నారు. తాజాగా ప్రీతి జింటా తాను ఖచ్చితంగా తెలుగు సినిమా చేస్తాను అంటూ ప్రకటించింది.

ఇటీవల సోషల్‌ మీడియాలో అభిమానులు అడిగిన ప్రశ్నలకు ప్రీతి జింటా సమాధానాలు చెబుతూ వచ్చింది. అందులో భాగంగా ప్రీతి జంటా ను తెలుగులో మళ్లీ ఎప్పుడు నటిస్తారు అంటూ ప్రశ్నించడం జరిగింది. అప్పుడు తప్పకుండా తెలుగు లో నటిస్తాను, అయితే మంచి కథ వస్తే కాదనను అంది.

ఏ ఒక్క సినిమా ను, ఏ ఒక్క భాష ను కాదనే ఉద్దేశ్యం తనకు లేదు అన్నట్లుగా ఈ అమ్మడు కామెంట్స్‌ చేసింది. ప్రస్తుతం హిందీ సినిమాలు కూడా పెద్దగా చేయని ఈమె మంచి కథల కోసం చూస్తుంది. వయసుకు తగ్గ పాత్రలు మరియు తన ఇమేజ్ కి తగ్గ కథల్లో నటించేందుకు ఎప్పుడూ సిద్దమే అన్నట్లుగా చెప్పుకొచ్చింది.

Tags:    

Similar News