అంజలి.. చీరలో స్టన్నింగ్ గా

తాజాగా అంజలి సిల్వర్ కలర్ శారీలో దిగిన పిక్స్ ను పోస్ట్ చేసింది. ఫుల్ వర్క్ ఉన్న శారీతో అంజలి అదరగొట్టేసింది. చైర్ లో కూర్చుని అందాలు ఆరబోసింది.

Update: 2024-05-07 03:30 GMT

హీరోయిన్ అంజలికి మంచి క్రేజ్ ఉన్న విషయం తెలిసిందే. ఓ వైపు సినిమాల్లో నటిస్తూనే.. మరోవైపు వెబ్ సరీసుల్లో కూడా యాక్ట్ చేస్తూ అదరగొడుతోంది. షాపింగ్ మాల్ మూవీ ద్వారా పరిచయం అయిన తెలుగందం అంజలి.. తమిళంతో పాటు తెలుగులో వెంకటేష్, బాలకృష్ణ లాంటి బడా హీరోల సరసన నటించింది. టాలీవుడ్ లో హోమ్లీ పాత్రలతో దివంగత నటి సౌందర్య లేని లోటు తీర్చింది అంజలి.

 

అయితే అంజలి.. ఎప్పుడూ వార్తల్లో నిలుస్తుంటోంది. స్టార్ ప్రొడ్యూసర్‌ ను ఆమె పెళ్లి చేసుకోబోతున్నట్లు ఇటీవల వార్తలు వచ్చాయి. ఇక ఒక‌ప్పుడు బొద్దుగా ఉండే ఈ బ్యూటీ.. ఇప్పుడు చాలా సన్నబడి అదరగొడుతోంది. సోషల్ మీడియాలో ఎప్పటికప్పుడు కొత్త ఫోటో షూట్‌ లు పోస్ట్ చేస్తూ.. కుర్రకారు మతులు పోగొడుతోంది. తన అందం, ఎక్స్ప్రెషన్స్ తో అందరినీ ఆకట్టుకుంటోంది. ఫాలోవర్లను కూడా పెంచుకుంటోంది.

 

తాజాగా అంజలి సిల్వర్ కలర్ శారీలో దిగిన పిక్స్ ను పోస్ట్ చేసింది. ఫుల్ వర్క్ ఉన్న శారీతో అంజలి అదరగొట్టేసింది. చైర్ లో కూర్చుని అందాలు ఆరబోసింది. ఓరగా చూస్తూ కుర్రాళ్లను ఫిదా చేస్తోంది. నడుము అందాలతో మైండ్ బ్లాక్ చేస్తోంది. తన అందాలన్నీ ఫోకస్ అయ్యేలా పోజులిస్తోంది. ప్రస్తుతం అంజలి కొత్త ఫోటోలు సోషల్ మీడియాలో తెగ చక్కర్లు కొడుతున్నాయి. అంజలి ఫోటోలు అదిరిపోయాయని కామెంట్లు పెడుతున్నారు.

ఇక ఈ బ్యూటీ సినిమాల విషయానికొస్తే.. ఇటీవల తన 50వ సినిమా ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ కామెడీ హారర్ థ్రిల్లర్ అనుకున్నంత స్థాయిలో హిట్ కాలేదు. ఈ నేపథ్యంలో అనుకున్న తేదీ కంటే కాస్త ముందుగానే అంటే మే 8 నుంచే ఈ సినిమా ఓటీటీలోకి రానుంది. ‘అక్క మళ్లీ వచ్చావా.. అయితే సరే ఆహాలో కలుద్దాం’ అని ఆహా క్యాప్షన్ ఇచ్చింది.

Read more!

ప్రస్తుతం చేతి నిండా సినిమాలతో బిజీగా ఉంది అంజలి. మాస్ కా దాస్ విశ్వక్ సేన్ సినిమా గ్యాంగ్స్ ఆఫ్ గోదావరిలో నటించింది. మరికొన్ని రోజుల్లో ఈ సినిమా విడుదల కానుంది. ఈ చిత్రంలో ఆమె వేశ్యగా కనిపించనున్నట్లు తెలుస్తోంది. మరోవైపు, రామ్ చరణ్ గేమ్ ఛేంజర్ సినిమాలో అంజలి నటిస్తోంది. ఈ మూవీలో ఆమె కీలక పాత్ర పోషిస్తుందని టాక్. సినిమాల ఎంపికలో సెలెక్టివ్ గా వెళుతూ తనకంటూ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకుంటోంది ఈ భామ. మరి కొత్త మూవీలతో అంజలి ఎలాంటి హిట్స్ అందుకుంటుందో చూడాలి.

Tags:    

Similar News