రవితేజ చేస్తుంది చరణ్ వద్దన్నదేనా?

Update: 2018-03-18 13:26 GMT
మెగాస్టార్ చిరంజీవి కెరీర్ లో శంకర్ దాదా సినిమాది చాలా ప్రత్యేక స్థానం. అదిరిపోయే కామెడీ టైమింగ్ తో చదువు లేని డాక్టర్ గా మున్నాభాయ్ హింది రీమేక్ లో చిరు నటనకు బాక్స్ ఆఫీస్ దగ్గర కూడా ఘనమైన వసూళ్లు దక్కాయి. ఇప్పటికీ చిరు ఆల్ టైం బెస్ట్ ఎంటర్ టైనర్స్ లో శంకర్ దాదా ఎమ్బిబిఎస్ టాప్ 5 లో ఉంటుంది. దాని సీక్వెల్ ఫ్లాప్ అయినప్పటికీ మెగా ఫాన్స్ కు ఫస్ట్ పార్ట్ ఎవర్ గ్రీన్ చిత్రమే. సహజంగానే దీని సీక్వెల్ వస్తే బాగుంటుంది కదా అన్న ఆలోచన రావడం సహజమే. సోగ్గాడే చిన్ని నాయన దర్శకుడు కళ్యాణ్ కృష్ణకు కూడా ఇదే థాట్ వచ్చింది. రావడం ఆలస్యం వెంటనే ఓ కథను సిద్ధం చేసుకుని చరణ్ కు వినిపించాడట. అది అంతగా నచ్చని చరణ్ సున్నితంగా వద్దని చెప్పినట్టు టాక్. దాంతో అదే కథను మార్పులు చేసి రవితేజ ను మెప్పించి నెల టికెట్ గా చేసినట్టు సమాచారం.

చరణ్ నాన్న సీక్వెల్స్ కి సంబంధించి ముందు నుంచి సున్నితంగానే వ్యవహరిస్తున్నాడు. తనకో మంచి మాస్ హిట్ ఇచ్చిన సంపత్ నంది ముఠా మేస్త్రి సీక్వెల్ గా చోటా మేస్త్రి అనే కథను సిద్ధం చేస్తే చెర్రి సాహసం చేయలేకపోయాడు. ఇలాంటివి చేసేటప్పుడు పాత క్లాసిక్స్ తో పోలిక వస్తుంది కనక స్క్రిప్ట్ వంద శాతం సంతృప్తి కలిగిస్తేనే ముందు వెళ్దామని ఆగిపోయాడట.ఇక అది తర్వాత ముందుకు వెళ్ళలేకపోయింది. చిరు ల్యాండ్ మార్క్ మూవీ ఖైది కూడా చరణ్ తో తీయాలనే ప్రయత్నాలు కొందరు దర్శక రచయితలు చేసారు. కాని అది మాత్రం చేయను కాక చేయను అని చెప్పి ఆ ఆలోచన కూడా విరమించుకున్న చరణ్ ఇప్పుడు శంకర్ దాదా ను వద్దని చెప్పడం విశేషమే.

ఇదే కాదు చరణ్ ముందు జగదేక వీరుడు అతిలోక సుందరి సీక్వెల్ ప్రతిపాదన కూడా ఉంది. తను ఒప్పుకుంటే ఎవరైనా ఆ సినిమాను తలదన్నేలా కథను సిద్ధం చేస్తే ఎంత బడ్జెట్ అయినా తాను తీస్తానని నిర్మాత అశ్విని దత్ గతంలోనే ప్రకటించారు. సో నాన్న అల్ టైం బ్లాక్ బస్టర్స్ ని చరణ్ చేసే ఉద్దేశంలో లేడని స్పష్టమవుతోంది. మరి ముందు ముందు తన ఆలోచన మారి ఏదైనా ప్రయత్నిస్తాడేమో చూడాలి. 
Tags:    

Similar News