• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  పుకార్లకు ఫుల్‌ స్టాప్‌.....

పుకార్లకు ఫుల్‌ స్టాప్‌.. డిస్కోరాజా స్టార్ట్‌

By - Tupaki Desk
Update: 2019-03-04 07:09 GMT
మాస్‌ మహారాజా రవితేజ టైం ఈమద్య కాలంలో ఏమాత్రం బాగోలేదు, అయినా కూడా మొండి ధైర్యంతో రవితేజ సినిమాలు చేస్తూనే ఉన్నాడు. అయితే గతంలో మాదిరిగా కాకుండా సినిమాల ఎంపిక విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నాడు. స్క్రిప్ట్‌ ను తనకు తెలిసిన రచయితలతో ఒకటికి రెండు మూడు సార్లు చర్చించి ఆ తర్వాత సెట్స్‌ పైకి వెళ్తున్నాడు. అయినా కూడా ఫలితం దక్కడం లేదు అది వేరే విషయం అనుకోండి. రవితేజ తన తదుపరి చిత్రాన్ని విఐ ఆనంద్‌ దర్శకత్వంలో చేసేందుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇవ్వడం జరిగింది. ఆ సినిమాకు సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చింది. అయితే సినిమా ప్రారంభం ఆలస్యం అవుతూ వస్తోంది.

'డిస్కోరాజా' ఆలస్యంకు రకరకాలుగా పుకార్లు షికార్లు చేశాయి. స్క్రిప్ట్‌ విషయంలో రవితేజ మరియు విఐ ఆనంద్‌ ల మద్య విభేదాలు తలెత్తాయని, రవితేజ సూచించిన మార్పులను ఆనంద్‌ చేసేందుకు నో చెప్పాడు అంటూ వార్తలు వచ్చాయి. దాంతో పాటు ఈ చిత్ర నిర్మాత పారితోషికం విషయంలో రవితేజను కాస్త తగ్గమని సూచించాడని, అందుకు రవితేజ నో చెప్పాడని రకరకాలుగా ప్రచారం జరుగుతుంది. సినిమా అసలు పట్టాలెక్కేనా లేదా అంటూ అంతా కూడా గుసగుసలాడుతున్న సమయంలో సినిమాను మొదలు పెట్టబోతున్నట్లుగా ప్రకటించారు.

స్క్రిప్ట్‌ విషయంలో రవితేజ, ఆనంద్‌ ల మద్య విభేదాలు మరియు పారితోషికం గురించిన వార్తలు అన్ని కూడా పుకార్లే అని తేలిపోయింది. ఆనంద్‌ పక్కా స్క్రిప్ట్‌ ను రెడీ చేసేందుకు కాస్త ఎక్కువ సమయం తీసుకున్నాడని, రవితేజకు తగ్గట్లుగా మంచి స్క్రిప్ట్‌ ను విఐ ఆనంద్‌ రెడీ చేశాడంటూ చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పుకొచ్చారు. పక్కా స్క్రిప్ట్‌ రెడీ అయిన నేపథ్యంలో రేపటి నుండే సినిమాకు సంబంధించిన రెగ్యులర్‌ షూటింగ్‌ మణికొండ ఏరియాలో మొదలు కాబోతుంది.
Tags:    
  • Ravi Teja 
  • VI Anand 
  • Telugu News 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS