అమితాబ్ తో ఇంత త్వ‌రగా ఊహించ‌లేద‌న్న ర‌ష్మిక‌

Update: 2021-04-03 16:20 GMT
బిగ్ బి అమితాబ్ బ‌చ్చ‌న్ తో గుడ్ బాయ్ లో ఆఫ‌ర్ త‌న‌కు ద‌క్కుతుంద‌ని ఎప్పుడూ ఊహించ‌లేద‌ని అన్నారు ర‌ష్మిక మంద‌న‌. ఈ అందాల భామ ఇటీవ‌ల సిద్ధార్థ్ మ‌ల్హోత్రా స‌ర‌స‌న మిష‌న్ మజ్ను అనే స్పై యాక్ష‌న్ చిత్రంతో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇటీవ‌ల‌ షూటింగ్ లోనూ పాల్గొంటోంది. నేడు బిగ్ బితో సెట్స్ లో జాయిన‌వుతున్నాన‌ని ర‌ష్మిక వెల్ల‌డించింది.

సౌత్ లో ఇప్ప‌టికే వ‌రుస‌గా క్రేజీ చిత్రాల‌లో అవ‌కాశాలు అందుకుంటున్న ర‌ష్మిక మంద‌న బాలీవుడ్ లో ఇద్ద‌రు క్రేజీ హీరోల సినిమాల్లో న‌టించ‌డం ఇటు సౌత్ అభిమానుల్లోనూ హాట్ టాపిక్ గా మారింది. ఇటీవ‌లే ర‌ష్మిక‌ను గూగుల్ నేష‌న‌ల్ క్ర‌ష్ గా ప్ర‌క‌టించాక త‌న క్రేజ్ మ‌రింత‌గా పెరిగింది. ఇక ఇదే హుషారులో బిగ్ బి అమితాబ్ చిత్రంలో న‌టిస్తున్నాన‌ని ఇలాంటి అరుదైన అవ‌కాశం త‌న‌కు ద‌క్కుతుంద‌ని ఊహించ‌లేద‌ని ర‌ష్మిక ఆనందం వ్య‌క్తం చేస్తోంది.
లెజెండ్ అమితాబ్ బచ్చన్ తో ఇంత చిన్న వయస్సులో న‌టించిన మ‌రో క‌థానాయిక లేనే లేదన్న చ‌ర్చా ర‌ష్మిక ఆనందాన్ని డ‌బుల్ చేస్తోందిట‌.

దీనిపై ర‌ష్మిక మాట్లాడుతూ... ``మిస్టర్ బచ్చన్ తో కలిసి పనిచేసే అవ‌కాశం క‌లిగినందుకు నేను నిజంగా కృతజ్ఞురాలిని. నా కెరీర్ ‌లో ఇంత త్వరగా సార్ ‌తో స్క్రీన్ స్పేస్ ని పంచుకుంటానని నేను ఎప్పుడూ అనుకోలేదు. అతనితో సాధ్యమైనంత ఎక్కువ జ్ఞాపకాల్ని  ఆనందించడానికి ఎదురుచూస్తున్నాను. నేను అమితాబ్ స‌ర్ నుండి చాలా నేర్చుకుంటాను`` అని అన్నారు.

ఇటీవల ల‌క్నోలో తన తొలి బాలీవుడ్ చిత్రం మిష‌న్ మ‌జ్ను చిత్రీక‌ర‌ణ‌  పూర్త‌యింది. తన మొదటి విడుదలకు ముందే తన రెండవ బాలీవుడ్ చిత్రాన్ని సొంతం చేసుకున్న ఈ బ్యూటీ మిషన్ మజ్ను  షెడ్యూల్ పూర్త‌యిన అనంత‌రం గుడ్ బై సెట్స్ లోకి ప్రవేశిస్తోంది‌.  సిద్దార్థ్ మల్హోత్రా సరసన బాలీవుడ్ ‌లోకి అడుగుపెడుతున్న ర‌ష్మిక‌.. కు అమితాబ్ తో అవ‌కాశం సౌత్ లోనూ చ‌ర్చనీయాంశ‌మైంది. ఇదే అద‌నుగా సోష‌ల్ మీడియాల్లో ర‌ష్మికకు భారీ ఫాలోయింగ్ పెరిగింది. తాను షేర్ చేస్తున్న వీడియోలు ఫోటోలు జోరుగా వైర‌ల్ అవుతున్నాయి. తాజాగా రష్మిక షేర్ చేసిన టాప్ ట‌క్క‌ర్ వీడియో సునామీ స్పీడ్ తో వైర‌ల్ అవుతోంది. ఈ పాట‌కు ర‌ష్మిక పెప్పీ డ్యాన్సులు ల‌వ్ లీగా ఉన్నాయంటూ అభిమానులు జోరుగా వైర‌ల్ చేస్తున్నారు.

Full View
Tags:    

Similar News