తొలి హీరోకే అలా కమిట్ అయిపోయిందట

Update: 2017-06-25 04:35 GMT
కన్నడ బ్యూటీ రష్మిక మందన.. ఈ పేరు గత కొన్ని రోజులుగా టాలీవుడ్ లో కూడా తెగ వినిపించేస్తోంది. గతేడాదికి కిరిక్ పార్టీతో ఎంట్రీ ఇచ్చిన ఆ భామ.. అంతలోనే విపరీతమైన క్రేజ్ సంపాదించేసుకుంది. ప్రస్తుతం కన్నడలో రెండు సినిమాలు.. తెలుగులో నాగశౌర్యతో ఓ మూవీ చేసేస్తోంది కూడా.

కొందరు టాలీవుడ్ స్టార్స్ పక్కన కూడా ఈమెను తీసుకుంటారనే న్యూస్ నడించింది కానీ అవేవీ వర్కవుట్ కాలేదు. అయితే.. తనకు వచ్చిన ఈ క్రేజ్ తో తెగ సంతోషంగా ఉన్నానంటోంది రష్మిక మందన. ఓ బ్యూటీ కాంటెస్ట్ లో తనను చూసిన కిరిక్ పార్టీ యూనిట్.. మూవీ ఆఫర్ చేయగా.. సినిమాల్లో చేయాలనే కోరిక ముందు నుంచి ఉన్న తాను.. వెంటనే ఈ ఫీల్డ్ లోకి వచ్చేశానని మందన చెబుతోంది. అయితే.. కొన్ని రోజులుగా కిరిక్ పార్టీ హీరో రక్షిత్ శెట్టితో ఈమె ప్రేమ వ్యవహారం గురించి విపరీతమైన టాక్ నడుస్తోంది. ఇప్పుడీ విషయాన్ని రష్మిక కన్ఫాం చేసేసింది.

తమ ఇద్దరికీ ఎంగేజ్మెంట్ కూడా ఫిక్స్ అయిందని చెప్పిన రష్మిక మందన.. 'మొదట మా ఇద్దరి మధ్య నిజానికి ఏమీ లేదు. కానీ మెల్లగా వర్క్ కు మించిన ఏదో భావన మొదలైంది. ప్రజలు మా గురించి మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇది అనవసరమైన మాటలకు తావు ఇస్తుండడంతో.. ఇరువురి కుటుంబాలు ఎంగేజ్మెంట్ పై సలహా ఇచ్చారు. తనకు నేను ఎంతో గౌరవం ఇస్తాను. సార్ అని పిలుస్తుంటే తెగ ఇబ్బంది పడతాడు. తనతో నా జీవితం ఎంతో భద్రంగా ఉంటుందని నాకు అర్ధమైంది' అని చెప్పింది రష్మిక మందన.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    

Similar News