మగాడిగా మరుజన్మ.. ఏంటీ రష్మిక చిలిపి కోరిక!
శర్వానంద్ - రష్మిక జంటగా నటించిన ఆడవాళ్లు మీకు జోహార్లు మార్చి 4న విడుదలవుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రమోషన్స్ లో రష్మిక మందన అండ్ టీమ్ బిజీ బిజీ. తాజా ఇంటర్వ్యూలో రష్మిక మాట్లాడుతూ పెళ్లి గురించి మగాడిగా పుట్టడం గురించి మాట్లాడింది.
కాబోయే వాడు ఎలా ఉండాలి? అని ప్రశ్నిస్తే దానికి క్రిప్టిక్ ఆన్సర్ ఇచ్చింది. తనకు అలాంటి ఇలాంటి అబ్బాయి కావాలనే ఆలోచన లేదట. మంచి వాడు అయితే పెళ్లాడేస్తుందట. ఇకపోతే ఆడవాళ్లు మీకు జోహార్లు మూవీ చూశాక .. పెళ్లి కూతురు కష్టాలు ఎలా ఉంటాయో గమనించానని చెప్పింది.
అసలు మరో జన్మ ఉంటే మగాడినై పుడతానని అంది. ఒళ్లంతా అలకరించుకొని మగాడి ముందు తల దించుకొని కూర్చోవాలి. అంతకుమందు చీర పూలు అలంకరణ అంటూ చాలా బాధలుంటాయి. ఇలాంటి బాధలు చూశాక.. మరో జన్మ వుంటే మగాడిగా పుడితే బావున్ను అనిపిస్తుంది. కాలు మీద కాలేసుకొని ప్రశ్నలు అడుగుతూ కూర్చోవచ్చు.. అని కూడా అంది.
అయితే రష్మికకు అసలు కష్టం ఎలా ఉంటుందో తెలీదు. ఈరోజుల్లో మగాళ్లకు పిల్ల దొరకడం లేదు. నానా ఇబ్బందులు పడి పెళ్లాడాల్సొస్తోంది. ప్రాక్టికల్ గా ఆడాళ్లకు ఈ ఇబ్బంది లేనే లేదు. ఆడపిల్లలు కరువైన వేళ రష్మిక ఇలాంటి నిర్ణయం తీసుకోవడం తగదంటూ సూచిస్తున్నారు బోయ్స్.
మరి రష్మిక ఇది గమనిస్తుందో లేదో? ఇక రష్మిక తదుపరి బాలీవుడ్ లో స్టార్ గా వెలిగిపోనున్న సంగతి తెలిసిందే. మన హీరోలకు చాలా మందికి లేని అరుదైన అవకాశం రష్మికకు ఉంది. అమ్మాయి గనుక.. హీరోయిన్ గా ఎదిగేసింది కాబట్టి..!