మహిళా దినోత్సవం వేళ శ్రీవల్లి షాకింగ్ గిఫ్ట్
`ఛలో` సినిమాతో టాలీవుడ్ లోకి ఎంట్రీ ఇచ్చిన కన్నడ సోయగం రష్మిక మందన్న. తొలి చిత్రంతోనే ఇండస్ట్రీ వర్గాల దృష్టిని ఆకర్షించింది. బ్యాక్ టు బ్యాక్ క్రేజీ ఆఫర్లని సొంతం చేసుకుని స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది. అందంతో పాటు అభినయం కూడా తోడవ్వడం... ఆకట్టుకునే తీరు క్రేజీ లుక్స్ తో యూత్ లో మంచి ఫాలోయింగ్ ని సొంతం చేసుకోవడమే కాకుండా నేషనల్ క్రష్ గా మారింది. రౌడీ స్టార్ విజయ్ దేవరకొండతో కలిసి నటించిన `గీత గోవిందం` చిత్రంతో ఏకంగా వంద కోట్ల క్లబ్ లో చేరి క్రేజీ హీరోయిన్ గా పేరు తెచ్చుకుంది.
సూపర్ స్టార్ మహేష్ బాబు తో `సరిలేరు నీకెవ్వరు` చిత్రంతో నటించే ఛాన్స్ ని దక్కించుకుని స్టార్ హీరోయిన్ గా మారిపోయింది. ఇక ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన `పుష్ప ది రైజ్`తో ఏకంగా పాన్ ఇండియా హీరోయిన్ ల జాబితాలో చేరిపోయి సంచలనం సృష్టించింది. శ్రీవల్లిగా కనిపించిన పాన్ ఇండియా స్థాయిలో క్రేజ్‌ని సొంతం చేసుకుంది. ఇదే ఏడాది బాలీవుడ్ లోనూ అడుగుపెడుతూ అక్కడ `పుష్ప`తో హంగామా చేయడం మొదలు పెట్టింది.
బన్నీ నటించిన `పుష్ప` దక్షిణాదిని మించి ఉత్తరాదిలో వసూళ్ల సునానీని సృష్టించిన విషయం తెలిసిందే. ఉత్తరాదిలో 100 కోట్లకు మించి వసూళ్లని రాబట్టిన ఈ మూవీ అక్కడ సంచలనాలు సృష్టించింది. దీంతో పార్ట్ 2 ని మరింత స్పెషల్ గా తీర్చి దిద్దాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు. `పుష్ప`తో వచ్చిన క్రేజ్‌ని మరింత పెంచుకునే దిశగా రష్మిక అడుగులు వేస్తోంది. ఇప్పటికే బాలీవుడ్ మేకర్స్ దృష్టిని ఆకర్షించిన రష్మిక మరింతగా బాలీవుడ్ లో దూసుకుపోవాలని ప్లాన్ లు వేస్తోంది.
ఇందులో భాగంగా పాపులర్ మ్యాగజైన్ హలో ఇండియా కవర్ పేజీపై హోయలు పోతూ అందాల విందు చేసింది. మరింత హాట్ గా కనిపించి కవర్ పేజీ కోసం రష్మిక పోజులిచ్చింది. ఇంత వరకు ఈ స్థాయిలో హాట్ మాట్ గా అందాల విందు చేయకపోవడంతో ప్రస్తుతం హలోఇండియా మ్యాగజైన్ సోషల్ మీడియా వేదికగా షేర్ చేసిన రష్మిక ఫొటోలు ఇప్పుడు నెట్టింట హాట్ టాపిక్ గా మారాయి. మంగళవారం అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా హలోఇండియా మ్యాగజైన్ సోషల్ మీడియా వేదికగా కవర్ పేజీలని విడుదల చేసింది.
ఈ కవర్ పేజీలో రష్మిక బోల్డ్ అవతార్ లో కనిపించడం పలువురిని షాక్ కు గురిచేస్తోంది. రష్మిక ప్రస్తుతం బాలీవుడ్ లో రెండు క్రేజీ చిత్రాల్లో నటిస్తోంది. సిద్ధార్థ్ మల్హోత్రాతో కలిసి `మిషన్ మజ్ను`తో బాలీవుడ్ లో ఎంట్రీ ఇస్తున్న రష్మిక ఈ సినిమాతో పాటు అమితాబ్ బచ్చన్ తో కలిసి `గుడ్ బై` చిత్రంలో నటిస్తోంది.
తాజాగా వరుణ్ ధావన్ చిత్రాన్ని అంగీకరించింది. ఇలా బ్యాక్ టు బ్యాక్ మూడు హిందీ చిత్రాల్లో నటిస్తున్న రష్మిక రానున్న రోజుల్లో బాలీవుడ్ లో మరిన్ని ఆఫర్లని దక్కించుకోవాలనే ఇలా బోల్డ్ అవతార్ లో హలోఇండియా మ్యాగజైన్ పై దర్శనమిచ్చిందని, అంతర్జాతీయ మహిళా దినోత్సవం వేళ శ్రీవల్లి షాకింగ్ గిఫ్ట్ అదరిందని అంటున్నారు.