బుచ్చి బాబు హీరో... జాన్వీ కపూర్ స్టార్?
ప్రస్తుతం టాలీవుడ్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా..బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ల తదుపరి ప్రాజెక్టుల గురించే ఆసక్తికర చర్చ నడుస్తోంది.
ప్రస్తుతం టాలీవుడ్‌లో దర్శకుడు బుచ్చిబాబు సానా..బాలీవుడ్ స్టార్ బ్యూటీ జాన్వీ కపూర్ల తదుపరి ప్రాజెక్టుల గురించే ఆసక్తికర చర్చ నడుస్తోంది. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా రిలీజ్ అయిన `పెద్ది` చిత్రంలో ఇద్దరు కలిసి పని చేయడంతో ఈ కాంబినేషన్ భారీ క్రేజ్ సంపాదించుకుంది. ఈ చిత్రం ముగిసిన నేపథ్యంలో ట్రేడ్ వర్గాలతో పాటు ఇండస్ట్రీ వర్గాల్లో కూడా ఇద్దరి ఫ్యూచర్ లైనప్‌లపై రకరకాల ఊహాగానాలు మొదలయ్యాయి. బుచ్చిబాబు తదుపరి ఏ హీరోతో సినిమా చేయబోతున్నారు? జాన్వీ కపూర్ ఏ టాలీవుడ్ హీరో సరసన తదుపరి ఛాన్స్ అందుకుంటుంది? అనే ప్రశ్నలు ఫిలిం నగర్ సర్కిల్స్‌లో హాట్ టాపిక్‌గా మారాయి.
బుచ్చిబాబు సానా విషయానికి వస్తే.. ఆయనది టాలీవుడ్‌లో విలక్షణమైన ప్రయాణం. మొదటి చిత్రం `ఉప్పెన`తోనే వంద కోట్ల క్లబ్ చేరి జాతీయ అవార్డు ను సైతం గెలుచుకున్న బుచ్చి రెండవ చిత్రానికే రామ్ చరణ్ లాంటి గ్లోబల్ స్టార్‌ను డైరెక్ట్ చేసే అరుదైన అవకాశాన్ని దక్కించుకున్నారు. గురువు సుకుమార్ అందించిన స్ఫూర్తితో `పెద్ది` చిత్రాన్ని అత్యంత భారీ స్థాయిలో గ్రామీణ నేపథ్యం ఉన్న స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కించి మేకింగ్ శైలిని నిరూపించుకున్నారు. ఇంతటి భారీ కాన్వాస్ ఉన్న చిత్రాన్ని హ్యాండిల్ చేసిన తర్వాత బుచ్చిబాబు తదుపరి అడుగు ఏ రేంజ్‌లో ఉండబోతుందనే ఆసక్తి అందరిలోనూ పెరిగింది.
బుచ్చిబాబు తదుపరి చిత్రం ఏ హీరోతో ఉండబోతుందనే దానిపై ఇండస్ట్రీలో రకరకాల కాంబినేషన్లు వినిపిస్తున్నాయి. మైత్రీ మూవీ మేకర్స్ - సుకుమార్ రైటింగ్స్ వంటి అగ్ర నిర్మాణ సంస్థలతో అత్యంత సన్నిహిత సంబంధాలు కలిగి ఉండటం వల్ల తదుపరి ప్రాజెక్ట్ కూడా టైర్-1 హీరోతోనే ఉండే అవకాశం ఉందని కొందరు భావిస్తున్నారు. ఎన్టీఆర్ ... అల్లు అర్జున్ లాంటి స్టార్స్‌తో బుచ్చిబాబుకు మంచి సాన్నిహిత్యం ఉండటంతో వారితో ఏమైనా ప్రాజెక్ట్ సెట్ అవుతుందా? లేక కథకు ప్రాధాన్యతనిస్తూ ఒక క్రేజీ యంగ్ హీరోతో కంటెంట్-డ్రివెన్ సినిమాను ప్లాన్ చేస్తారా ? అనేది తెలియాల్సి ఉంది. బుచ్చిబాబు సిద్ధం చేసే కొత్త లైన్‌ను బట్టే ఆ హీరో ఎవరనే సస్పెన్స్‌కు తెరపడనుంది.
మరోవైపు అతిలోక సుందరి శ్రీదేవి వారసురాలిగా ఎంట్రీ ఇచ్చిన జాన్వీ కపూర్ తక్కువ సమయంలోనే టాలీవుడ్‌లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌గా మారిపోయింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా నటనకు ప్రాధాన్యమున్న పాత్రలను ఎంచుకుంటూ సౌత్ ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకునే ప్రయత్నంలో ఉంది. జూనియర్ ఎన్టీఆర్ సరసన `దేవర` చిత్రంతో తెలుగు తెరకు పరిచయమైన ముద్దుగుమ్మ, ఆ వెంటనే రామ్ చరణ్‌తో `పెద్ది` చిత్రంలో నటించి బ్యాక్-టు-బ్యాక్ టాలీవుడ్ టాప్ లీగ్ స్టార్స్‌తో స్క్రీన్ షేర్ చేసుకునే గోల్డెన్ ఛాన్స్ దక్కించుకుంది. దీంతో జాన్వీ బాలీవుడ్ నటిగానే కాకుండా ప్రాపర్ పాన్-ఇండియా స్టార్‌గా ఎదిగింది.
టాలీవుడ్‌లో ఇప్పటికే ఇద్దరు అగ్ర హీరోలతో పనిచేసిన అనుభవం ఉన్న జాన్వీ కపూర్ తదుపరి ఏ టాలీవుడ్ హీరోతో జోడీ కట్టబోతుందనే డిస్కషన్స్ జోరుగా సాగుతున్నాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో రూపొందుతున్న పలు క్రేజీ పాన్-ఇండియా ప్రాజెక్టుల కోసం దర్శక, నిర్మాతలు అమ్మడి పేరును ప్రముఖంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. రెబెల్ స్టార్ ప్రభాస్, సూపర్ స్టార్ మహేష్ బాబు , ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ లాంటి అగ్ర నాయకులతో ఆమె తదుపరి కాంబినేషన్ ఉండే అవకాశం ఉందంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. కేవలం స్టార్ హీరోల పక్కనే కాకుండా బలమైన కంటెంట్ ఉన్న కథల ద్వారా టాలీవుడ్‌లో తన మార్కెట్‌ను మరింత విస్తరించుకోవాలని జాన్వీ భావిస్తున్నట్లు సమాచారం.
ఏదేమైనప్పటికీ బుచ్చిబాబు సానా సృజనాత్మకత -జాన్వీ కపూర్ స్టార్ ఇమేజ్ టాలీవుడ్ ట్రేడ్‌ను ఎంతగానో ఆకర్షిస్తున్నాయి. `పెద్ది` చిత్రం తర్వాత ఇద్దరి కెరీర్ గ్రాఫ్‌లు మరింత పైకి లేవడం ఖాయంగా కనిపిస్తుండటంతో తదుపరి నిర్ణయాలపైనే అందరి దృష్టి కేంద్రీకృతమైంది. బుచ్చిబాబు ఒక వైపు తదుపరి కథను పదును పెట్టే పనిలో ఉండగా.. జాన్వీ తన డేట్స్‌ను అడ్జస్ట్ చేసుకుంటూ సౌత్ ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇస్తోంది.