ఉమెన్ డ్రెస్సింగ్.. సింగర్ సునీత కామెంట్స్‌ తో మళ్ళీ..

మహిళల డ్రెస్సింగ్, పర్సనల్ ఫ్రీడమ్, ఫెమినిజం వంటి అంశాలపై ప్రముఖ సింగర్ సునీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి

Update: 2026-06-25 04:26 GMT

మహిళల డ్రెస్సింగ్, పర్సనల్ ఫ్రీడమ్, ఫెమినిజం వంటి అంశాలపై ప్రముఖ సింగర్ సునీత చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున చర్చకు దారితీశాయి. రీసెంట్ గా మహిళల డ్రెస్సింగ్, సమాజం స్పందించే తీరు, సినిమా ఇండస్ట్రీలో మహిళలు ఎదుర్కొనే పరిస్థితులపై తన అభిప్రాయాలను వెల్లడించారు. ప్రస్తుతం ఆమె కామెంట్స్ వైరల్ అవుతుండగా.. కొందరు సమర్థిస్తుంటే, మరికొందరు భిన్నాభిప్రాయాలు వ్యక్తం చేస్తున్నారు.

మహిళలు ఎలాంటి డ్రెస్సులు ధరించాలనేది వారి పర్సనల్ డెసిషన్ అంటూ అందరూ చెబుతారని, అయితే ఆ నిర్ణయానికి వచ్చే రెస్పాన్స్ కూడా అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందని సునీత అభిప్రాయపడ్డారు. "ఏం చేస్తున్నామో, ఎలాంటి డ్రెస్సులు వేసుకున్నామో మనకు తెలుసు. ఆ తర్వాత విమర్శలు వచ్చినప్పుడు వాటి నుంచి పూర్తిగా తప్పించుకోవడానికి ప్రయత్నించడం కంటే, అవసరమైతే తన తప్పును ఒప్పుకోవడం మెచ్యూరిటీ" అని ఆమె అన్నారు.

ఇదే సందర్భంలో "మై బాడీ.. మై రైట్" అనే ఫీలింగ్ పై కూడా ఆమె స్పందించారు. మహిళలు తమ బాడీపై తమకే రైట్ ఉందని చెప్పడం సహజమేనని, అయితే చూసేవారి యాంగిల్ కూడా వాస్తవమేనని అన్నారు. "అమ్మాయిలు 'నా బాడీ.. నా ఇష్టం' అంటారు. కానీ చూసేవాడి కళ్లు కూడా వాడివే కదా. ఆ అంశాన్ని ఒక్క యాంగిల్ లో మాత్రమే చూడలేం" అని వ్యాఖ్యానించారు. తన దృష్టిలో ఇదే నిజమైన ఫ్రీడమ్ పై చర్చకు కారణమయ్యే అంశమని చెప్పారు.

ఫెమినిజం గురించి కూడా సునీత తన అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఫెమినిజం అంటే ఏంటనే విషయంపై సమాజంలో మరింత చర్చ జరగాల్సిన అవసరం ఉందన్నారు. పురుషులు, మహిళలు అన్ని విషయాల్లో ఒకేలా ఉండరని, కొన్ని అంశాలను సమాజం తప్పుగా అర్థం చేసుకుంటోందని ఆమె అభిప్రాయపడ్డారు. సినిమా రంగంలో మహిళలు ఎదుర్కొనే పరిస్థితుల గురించి కూడా సునీత మాట్లాడారు. ఒక సినిమాలో ఏదైనా సన్నివేశంలో నటించాలా వద్దా అనే నిర్ణయం పూర్తిగా ఆ నటికి సంబంధించిన పరిస్థితులపై ఆధారపడి ఉంటుందని చెప్పారు.

అవకాశాలు, అవసరాలు, ఫ్యూచర్ పై ఆలోచన, భయం, పర్సనల్ మెచ్యూరిటీ వంటి అనేక అంశాలను బట్టి నిర్ణయం తీసుకుంటారని తెలిపారు. అయినప్పటికీ ఏ సందర్భంలోనైనా "నో" చెప్పే హక్కు ఆమెకు ఎప్పుడూ ఉంటుందని స్పష్టం చేశారు. సినిమాల్లో చూపించే కొన్ని సీన్స్ సమాజంపై ప్రభావం చూపుతున్నాయని కూడా ఆమె అభిప్రాయపడ్డారు. కొన్ని విషయాలను పదే పదే స్క్రీన్ పై చూపించడం వల్ల అవి సమాజంలో సాధారణమైనవిగా మారుతున్నాయని అన్నారు.

ముఖ్యంగా చిన్నపిల్లల నుంచి పెద్దల వరకు తప్పుడు పదాలు కామన్ గా మాట్లాడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేశారు. అలాగే మహిళల నిర్ణయాలను ఎవరూ బలవంతంగా ప్రభావితం చేయకూడదని సునీత అన్నారు. "ఎస్ చెప్పాలా, నో చెప్పాలా అనేది పూర్తిగా వ్యక్తిగత నిర్ణయం. ఇది కేవలం పరిశ్రమకు మాత్రమే సంబంధించిన విషయం కాదు. సమాజంలోని ప్రతి మహిళకు వర్తించే అంశం. అవసరమైతే క్లియర్ గా గీత గీయాలి. ఫుల్‌ స్టాప్ పెట్టాలి" అని ఆమె సజెస్ట్ చేశారు. సునీత చేసిన కామెంట్స్ తో ఉమెన్ డ్రెస్సింగ్ ఇష్యూ మరోసారి సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌ గా మారింది.

Tags:    

Similar News