కిల్ల‌ర్ లుక్ లో ర‌ష్మిక కిల్ చేస్తోందే!

Update: 2022-02-27 06:39 GMT
కూర్గ్ బ్యూటీ ర‌ష్మి మంద‌న్న సారీ లుక్ ఒక‌టి ఇటీవ‌ల సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారిన సంగ‌తి తెలిసిందే. ఫోటో పాత‌దే అయినా అందులో బ్యూటీ ఒంపు సొంపుల‌కు ఎవ‌రైనా ప్లాట్ పోవాల్సిందే. న‌లుపు సారీలో  కెమెరాకి ఇచ్చిన ఫోజులు మ‌రోసారి నెట్టింట మ‌రోసారి  చ‌ర్చ‌నీయాంశ‌గా మారింది.

అందులోనూ   స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతోంది. న‌ల్ల చీర రైక మ్యాచింగ్ బ్లౌజ్ ధ‌రించిన ర‌ష్మిక కెమెరాకి వ‌లపు యాంగిల్ లో ఫోజులు ఇచ్చింది.

త‌ల‌కాయ‌ని కాస్త క్రింద‌కి దించి..రెండు చేతులు త‌ల‌పై జుట్టు మ‌ధ్య‌లోకి చేర్చి త‌న‌లో విర‌హ‌వేద‌న మ‌నోహ‌రిని  త‌ట్టి లేపింది. మునుపెన్న‌డు చూడ‌ని స‌రికొత్త ర‌ష్మిక‌ని ఆవిష్క‌రించింది. ర‌ష్మిక న‌ల్ల‌టి చీర ధ‌రించ‌డమే ఓ సంచ‌ల‌న‌మైతే...ఆ న‌లుపు వ‌ర్ణంలో మ‌నోహ‌రిలా మ‌రింత అందంగా ఎలివేట్ అవుతోంది.

ఎడ‌మ చేతి వేలికి గ్రీన్ కల‌ర్ పొడితో కూడిన రింగ్..కుడిచేతికి  ధ‌రించిన గాజులు స‌మ్ థింగ్ స్పెష‌ల్ గా హైలైట్ అవుతున్నాయి.  ప్ర‌స్తుతం ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ గా మారింది. ర‌ష్మిక భిమానులు ఓ రేంజ్ లో షేర్ చేస్తున్నారు.

ఇక ర‌ష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే  `పుష్ప` లో శ్రీవ‌ల్లి పాత్ర‌తో తెలుగు ప్రేక్ష‌కుల హృద‌యాకి మ‌రింత ద‌గ్గ‌రైంది. న‌టిగా త‌న‌లో కొత్త కోణాన్ని వెండి తెర‌పై ఆవిష్క‌రించిన తీరుకు ఎవ‌రైనా ఫిదా అవ్వాల్సిందే. శ్రీవ‌ల్లి పాత్ర‌తో కొన్నాళ్ల  పాటు ప్రేక్ష‌కుల‌కు గుర్తిండిపోతుంది అన‌డంలో  ఎలాంటి సందేహం లేదు.

ర‌ష్మిక లో సిస‌లైన న‌టిని క్రియేటివ్ మేక‌ర్  సుకుమార్  పైకి తీసుకొచ్చారు. బాలీవుడ్ లో స్థిర‌ప‌డాల‌నుకుంటోన్న ర‌ష్మిక‌కు శ్రీ వ‌ల్లి పాత్ర మంచి బూస్టింగ్ ఇస్తుంది. జాతీయ స్థాయిలో బాగా పాపుల‌ర్ అయింది.

మొద‌టి భాగం  పెద్ద స‌క్సెస్ అయిన నేప‌థ్యంలో రెండ‌వ భాగం  `పుష్ప ది` రూల్ పై భారీ అంచ‌నాలు నెల‌కొన్నాయి.పుష్ప 2 ప్రీప్రొడ‌క్ష‌న్ వేగంగా పూర్త‌వుతోంది. దర్శకుడు సుకుమార్ స‌హా ప్రధాన సాంకేతిక నిపుణులు.. టీమ్ లోని నటీనటులతో పాటు అల్లు అర్జున్ మీటింగ్ ను ఏర్పాటు చేసినట్లు తెలుస్తోంది.

ఈ స‌మావేశంలో చాలా అంశాలు చ‌ర్చ‌కు వ‌చ్చాయి. తొలిగా బ‌న్ని తాము అందుకున్న‌ ఫలితంపై తన ఆనందాన్ని వ్యక్తం చేశాడు. అయితే ఈ సంవత్సరం డిసెంబర్ నాటికి సినిమా పార్ట్ 2 ని తెర‌పైకి తేగ‌ల‌మా?  లేదా?  అన్న త‌ర్జ‌న భ‌ర్జ‌న  సాగుతోంది.

ఇక బాలీవుడ్ లో ర‌ష్మిక బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తోంది. `మిష‌న్ మ‌జ్ను`..`గుడ్ బై` చిత్రాల్లో న‌టిస్తోంది.  ఈ సినిమాల‌పై అమ్మ‌డు చాలా ఆశ‌లు పెట్టుకుంది. ఇప్ప‌టికే ఆ చిత్రాల షూటింగ్ కూడా పూర్త‌యింది. త్వ‌ర‌లోనే ఆ చిత్రాలు  ప్రేక్ష‌కుల ముందుకు రానున్నాయి. బాలీవుడ్ లో అవ‌కాశాలు వ‌స్తే అక్క‌డే స్థిర‌ప‌డిపోవాల‌ని ప్లాన్ చేసుకుంటోంది ర‌ష్మిక‌.
Tags:    

Similar News