ఫోటో స్టోరి: ర‌ష్మిక క‌ర్వ్ టాప్ అదిరిందిగా

Update: 2022-02-01 04:30 GMT
రోమ్ వెళితే రోమ‌న్ లా ఉండాల‌నేది సామెత‌. కానీ దానిని తూ.చ త‌ప్ప‌క ఆచ‌రించడంలో సౌత్ నాయిక‌లు ఇటీవ‌ల చాలా ముందుంటున్నారు. గ‌డిచిన‌ కాలంలో టాలీవుడ్ స్టార్ హీరోయిన్ ర‌ష్మిక మంద‌న యాటిట్యూడ్ యూత్ లో హాట్ టాపిక్ గా మారింది. ఈ బ్యూటీ ఆరంభం ఎలా క‌నిపించిందో తెలిసిందే. ఇప్పుడు త‌న‌లో అనూహ్య‌ మార్పును చూశాక‌.. ఔరా! అంటూ నోరెళ్ల‌బెడుతున్నారు.

ఎక్స్ పోజింగ్ ప‌రంగా మునుప‌టిలా గిరి గీసుకుని కూచోబ‌డం లేదు. అన‌వ‌స‌ర‌ హ‌ద్దులు నిర్ణ‌యించ‌డం లేదు. అన్ లిమిటెడ్ గా అందాల ఆర‌బోత‌కు ర‌ష్మిక‌ ఓకే చెప్పేస్తోంది. ఇక హిందీ సినిమాల్లో న‌టిస్తూ ముంబైకి ట‌చ్ లో ఉన్న ర‌ష్మిక లో ఇంకా చాలా మార్పులు బ‌య‌ట‌ప‌డ్డాయ్. పుష్ప స‌క్సెస్ అనంత‌రం ముంబై స‌ర్కిల్స్ లో రష్మిక పాపులారిటీ అమాంతం పెరిగింది. దీంతో మ‌రింత‌గా చెల‌రేగిపోతోంది.

తాజాగా ర‌ష్మిక క‌ర్వీ టాప్ మ‌తులు చెడ‌గొట్టింది. రెడ్ హాట్ డిజైన‌ర్ టాప్ ధ‌రించిన ర‌ష్మిక ఒంపు సొంపులు ఈ లుక్ లో ఫుల్ ట్రీటిచ్చాయి. ఈ క‌న్న‌డ బ్యూటీ అలా చిరున‌వ్వులు చిందిస్తూ త‌న‌కేమీ తెలియ‌న‌ట్టే వ్య‌వ‌హ‌రిస్తున్నా యూత్ చూపులు మాత్రం త‌న‌నే అనుస‌రించాయి. ర‌ష్మిక స్మైల్ అదిరింది. అందం ఆక‌ట్టుకుంటోంది. ఆ ఒంపుసొంపులు మ‌త్తెక్కిస్తున్నాయి.. అంటూ యూత్ కామెంట్లు చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటోగ్రాఫ్స్ అంత‌ర్జాలంలో వైర‌ల్ గా మారాయి. బాలీవుడ్ లో మిష‌న్ మ‌జ్ను- గుడ్ బాయ్ చిత్రాల్లో న‌టిస్తున్న ఈ బ్యూటీ తెలుగులో ఆడాళ్లు మీకు జోహార్లు  అనే చిత్రంలో న‌టిస్తూ బిజీగా ఉంది.
Tags:    

Similar News