ఇంత వేడిగా మునుపెన్న‌డూ లేని ట్రీట్

Update: 2021-12-27 23:30 GMT
నేష‌న‌ల్ క్ర‌ష్ ర‌ష్మిక మంద‌నకు అన్నివిధాలా క‌లిసొస్తోంది. బ్యాక్ టు బ్యాక్ స్టార్ హీరోల స‌ర‌స‌న న‌టించిన సినిమాల‌న్నీ బ్లాక్ బ‌స్ట‌ర్లుగా నిలుస్తూ త‌న రేంజునే మార్చేస్తున్నాయి. ఇక త‌న‌  కెరీర్ తెలుగు-హిందీలో జెట్ స్పీడ్ తో ప‌రుగులు పెడుతోన్న సంగ‌తి తెలిసిందే. టాలీవుడ్..బాలీవుడ్ లో బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేస్తూ బిజీగా ఉంది. ఇటీవ‌లే అమ్మ‌డు `పుష్ప- దిరైజ్` తో మ‌రో స‌క్సెస్ ని ఖాతాలో వేసుకుంది. ఇందులో ర‌ష్మిక పోషించిన‌ శ్రీవ‌ల్లి పాత్ర‌కు మంచి పేరొచ్చింది. ర‌ష్మిక సిస‌లైన పెర్పార్మర్ గా ప్రూవ్ చేసుకుంది. న‌టిగా త‌న గ్రాఫ్ ని మ‌రింత మెరుగు ప‌రుచుకుంది. ఇక సెకెండ్ ఫార్ట్  లో శ్రీవ‌ల్లి పాత్ర మ‌రింత ఎగ్జైట్ మెంట్ తో సాగుతుంద‌ని గుసగుస వినిపిస్తుంది.

ఇక సోష‌ల్ మీడియాలో ర‌ష్మిక యాక్టివ్ నెస్ గురించి చెప్పాల్సిన ప‌నిలేదు. ఎప్ప‌టిక‌ప్పుడు కొత్త ఫోటోల‌తో కుర్రాళ్ల గుండెల్లో మంట‌లు పుట్టిస్తోంది. తాజాగా ర‌ష్మిక కొత్త ఫోటో ఇప్పుడు ఇన్ స్టాని షేక్ చేస్తుంది. న‌ల్ల చీర‌..మ్యాచింగ్ బ్లౌజు ధ‌రించి అందాల‌తో అల‌రిస్తోంది. బ్లాక్ శారీలో మత్తెక్కించే చూపుల‌తో మంత్ర ముగ్దుల్ని చేస్తోంది. ప్ర‌స్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైర‌ల్ గా మారింది. అభిమానులు ఈ లుక్ పై హాట్ కామెంట్ల‌తో ఎటాక్  చేస్తున్నారు. ర‌ష్మిక‌ న‌ల్ల రైక‌లో మ‌రింత అందంగా క‌నిపిస్తోందంటూ కామెంట్లు పెడుతున్నారు.

ఇక ర‌ష్మిక సినిమాల విష‌యానికి వ‌స్తే `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` అనే చిత్రంలో న‌టిస్తోంది. ఈ సినిమా సెట్స్ లో ఉంది. మ‌రికొన్ని ప్రాజెక్ట్ ల‌కు సైన్ చేసింది.  ఇక బాలీవుడ్ లో `మిష‌న్ మ‌జ్ను`..`గుడ్ బై  చిత్రాల్లో న‌టిస్తోంది. `మిష‌న్ మ‌జ్ను` లో సిద్ధార్ధ్ మ‌ల్హోత్రా తో క‌లిసి న‌టిస్తోంది. ఇదే బాలీవుడ్ డెబ్యూ మూవీ.  ఈసినిమా పై ర‌ష్మిక చాలా ఆశ‌లు పెట్టుకుంది. భ‌విష్య‌త్ లో హిందీ లో స్థిర‌ప‌డాల‌ని ప్లాన్ చేసుకుంటోంద‌ని గుస‌గుస‌లు వైర‌ల్ అవుతున్నాయి. మ‌రోవైపు త‌మిళంలోనూ ఈ భామ ప్ర‌య‌త్నాలు స‌ఫ‌ల‌మ‌వుతున్నాయ‌ని తెలిసింది.
Tags:    

Similar News