పొర విప్పిన నాగినిలా ఏమిటా లుక్కు ర‌ష్మికా?

Update: 2021-10-19 16:30 GMT
వ్వాటే బ్యూటీ ర‌ష్మిక మంద‌న కెరీర్ ప‌రంగా ఫుల్ స్వింగ్ లో ఉంది. ర‌ష్మిక‌ ప‌ట్టింద‌ల్లా బంగార‌మే అవుతోంది. టాలీవుడ్ లో ఇప్ప‌టికే మూడు..నాలుగు పెద్ద‌ సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిలో ఒక‌టి పాన్ ఇండియా ప్రాజెక్ట్. ఆ సినిమా హిట్టైతే ర‌ష్మిక కెరీర్ మ‌రింత రంగులమ‌యం అవుతుంది. ఇదే స్పీడ్ లో బాలీవుడ్ లోనూ బిజీ అయ్యే ప్ర‌య‌త్నాలు చేస్తోంది. ప్ర‌స్తుతం అక్క‌డా రెండు చిత్రాలు చేస్తోంది. ఇలా  క్ష‌ణం తీరిక లేకుండా అమ్మ‌డు హైద‌రాబాద్ టూ ముంబై ప‌రుగులు పెడుతోంది. అన్నింటినీ మించి  త‌న‌దైన చ‌లాకీత‌నంతో అభిమానుల‌ను సంపాదించుకోవ‌డం విశేషం. ర‌ష్మిక ఏదైనా ఈవెంట్ కు హాజ‌ర‌వుతుందంటే ఆమె కోస‌మే ప్ర‌త్యేకంగా విచ్చేసే అభిమానుల్ని సంపాదించుకుంది.

సినిమాల క‌న్నా..త‌న మాట‌కారిత‌నంతోనే ఇదంతా సాధ్య‌మైంది అన్న‌ది వాస్త‌వం. ర‌ష్మిక చేసింది కొన్నిసినిమాలే అయినా తెలుగు లో చాలా వేగంగా జ‌నాల్లోకి దూసుకెళ్లింది. ఆ సంగ‌తి ప‌క్క‌న‌బెడితే ఇన్ స్టాలో ఈ బ్యూటీ వ‌రుస‌ ఫోటోషూట్ల‌తో చేసే ర‌చ్చ గురించి తెలిసిందే. స‌మ‌యం చిక్కిన‌ప్పుడు కొత్త ఫోటో సెష‌న్స్ లో పాల్గొని  ట్రెండీ వెర్ష‌న్స్ తో కుర్రాళ్ల‌లో కాక‌లు రేపుతోంది. తాజాగా ర‌ష్మిక ఓ బ్లాక్ అండ్ వైట్ డిజైనర్ డ్రెస్ లో మ‌త్తెక్కించే లుక్ ఒక‌టి షేర్ చేసింది. ఈ ఫోటోలో ర‌ష్మిక అంద‌చందాలు చూప‌రుల‌ను క‌ట్టి ప‌డేస్తున్నాయి. చూపుల‌తోనే మ‌త్తెక్కిస్తోందంటూ ఇన్ స్టా ఫాలోవ‌ర్స్ కామెంట్ల‌తో మ‌రింత హీటెక్కిస్తున్నారు. పొర విప్పిన నాగినిలా ఏమిటా లుక్కు ర‌ష్మికా? అంటూ ఒక అభిమాని కాస్త కొంటెగానే ఒపీనియ‌న్ చెప్పాడు.

ప్ర‌స్తుతం అల్లు అర్జున్ స‌ర‌స‌న పాన్ ఇండియా చిత్రం `పుష్ప‌`లో ర‌ష్మిక న‌టిస్తోంది. అలాగే ధృవ సార్జా హీరోగా నంద భాస్క‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో తెలుగు..త‌మిళ్..క‌న్న‌డ భాష‌ల్లో తెర‌కెక్కుతోన్న `పొగ‌రు`లో న‌టిస్తోంది. మ‌రోవైపు `ఆడ‌వాళ్లు మీకు జోహార్లు` అనే చిత్రం షూటింగ్ లోనూ బిజీగా ఉంది. ఇక బాలీవుడ్ లో `మిష‌న్ మ‌జ్ను`..`గుడ్ బై` చిత్రాల్లో న‌టిస్తోంది.
Tags:    

Similar News