• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  గుడ్ బా‌య్ చెబుతున్న...

గుడ్ బా‌య్ చెబుతున్న ర‌ష్మిక మందన‌..!

By - Tupaki Desk
Update: 2021-04-13 02:30 GMT
టాలీవుడ్ లో అగ్ర క‌థానాయిక‌గా వెలిగిపోతోంది ర‌ష్మిక మంద‌న‌. క‌న్న‌డ రంగం నుంచి వ‌చ్చిన ఈ బ్యూటీ నెమ్మ‌దిగా టాలీవుడ్ లో పాగా వేసి ఇప్పుడు బాలీవుడ్ లోనూ పెద్ద కెరీర్ ని ఆశిస్తోంది. ఆ క్ర‌మంలోనే ఈ అమ్మ‌డు టాలీవుడ్ కి గుడ్ బాయ్ చెప్పేయ‌బోతోంద‌ని తాజాగా ప్ర‌చారం సాగిపో‌తోంది. ఇది నిజ‌మా అన్న‌ది తెలియాలంటే వివ‌రాల్లోకి వెళ్లాలి.

నిజానికి ర‌ష్మిక బాలీవుడ్ లో బ్యాక్ టు బ్యాక్ సినిమాల‌కు క‌మిట‌వ్వ‌డమే ఈ ప్ర‌చారానికి కార‌ణం. ర‌ష్మిక మందన న‌టిస్తున్న అప్ క‌మింగ్ హిందీ మూవీ టైటిల్ గుడ్ బా‌య్ కావ‌డం కూడా ఈ త‌ర‌హా ప్ర‌చారానికి కార‌ణం. ఒక‌వేళ నిజంగానే ఈ సినిమా హిట్ అయితే మాత్రం తెలుగుకి ఈ బ్యూటీ దూరం అయ్యే ఛాన్సులు చాలా ఉన్నాయి అంటూ అప్పుడే గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి.

అయితే ర‌ష్మిక వైపు నుంచి వెర్ష‌న్ వేరేగా ఉంది. ఈ అమ్మ‌డికి చాలా కాలంగా బాలీవుడ్ లో ఆఫ‌ర్లు వ‌స్తున్నా ఓ ప‌ట్టాన అంగీక‌రించ‌డం లేదు. ఇంత‌కుముందు షాహిద్ క‌పూర్ స‌ర‌స‌న తెలుగు బ్లాక్ బ‌స్ట‌ర్ జెర్సీ రీమేక్ లో న‌టించే అవ‌కాశం వ‌రించింది. కానీ ర‌ష్మిక ఆ సినిమాని కాద‌ని అనుకుంది. ఆ క్ర‌మంలోనే ర‌ష్మిక స్థానంలో సూప‌ర్ 30 బ్యూటీ మృణాల్ ఠాకూర్ ని ఆ అవ‌కాశం వ‌రించింది. గౌత‌మ్ తిన్న‌నూరి ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నారు.

అయితే హిందీ జెర్సీ ఆఫ‌ర్ వ‌దులుకున్న రష్మి‌క వెంట వెంట‌నే సిద్ధార్థ్ మ‌ల్హోత్రాతో మిష‌న్ మ‌జ్ను.. అలాగే అమితాబ్ తో గుడ్ బాయ్ సినిమాల‌కు సంత‌కాలు చేసింది. ఇక టాలీవుడ్ నుంచి నిష్క్ర‌మిస్తోంది అన్న ప్ర‌చారం అసంబ‌ద్ధం. ఈ బ్యూటీ ఇక్క‌డ పుష్ప లాంటి భారీ చిత్రంలో న‌టిస్తోంది. ఎన్టీఆర్ - త్రివిక్ర‌మ్ మూవీకి ర‌ష్మిక పేరు ప్ర‌పోజ‌ల్స్ లో ఉంది. ప్ర‌స్తుతానికి ఈ చిత్రం హోల్డ్ లో ఉంద‌ని స‌మాచారం. అలాగే రామ్ చ‌ర‌ణ్ - శంక‌ర్ మూవీలోనూ ర‌ష్మిక న‌టిస్తోంది అంటూ ప్ర‌చారం ఉంది. కాబ‌ట్టి ఇప్ప‌ట్లో తెలుగు ప‌రిశ్ర‌మ‌ను ర‌ష్మిక వ‌దిలి పెట్ట‌ద‌నడంలో సందేహ‌మేం లేదు. ప్ర‌స్తుతానికి తెలివైన ర‌ష్మిక తెలుగు-త‌మిళం- హిందీ ప‌రిశ్ర‌మ‌ల్లో మూడుముక్క‌లాట ఆడుతోంది.




Tags:    
  • Rashmika Mandana 
  • Bollywood 
  • Tollywood 

Similar News

Tupaki Exclusive: సుశాంత్ హ్యాండ్ ఇచ్చినప్పుడు అంతా బ్లాంక్ అయిపోయింది

2026-11-10 08:03 GMT

RC17 : అప్పుడు ఆది, ఫాహద్‌ ఇప్పుడు రిషికాంత్‌..!

2026-11-10 07:52 GMT

స్పెషల్ విఐపి లతో శ్రీ లీల దీపావళి వేడుకలు.. ఫొటోస్ వైరల్!

2026-11-10 07:49 GMT

పవన్ కళ్యాణ్ – అన్నా కొణిదెల మధ్య రెండు నెలల్లోనే ఏమైపోయింది?

2026-11-10 07:49 GMT

నా నోటి తిట్లు తింటే కెరీర్ సెట్ అయినట్లే!

2026-11-10 07:00 GMT

లంకేశ్వరుడి గెటప్ కోసం యష్ పడిన కష్టం ఇదే!

2026-11-10 06:56 GMT

కథల సెలక్షన్.. గేర్ మారుస్తున్న చిరు

2026-11-10 06:56 GMT

అల్లుడిని చూసి మామ గ‌ర్వంగా!

2026-11-10 06:56 GMT

రాకెట్లు కాల్చడం సంస్కృతి కాదు!

2026-11-10 06:55 GMT

'రామాయణం' బుకింగ్స్.. ఒక్క రోజులో 16 లక్షల టికెట్లు!

2026-11-10 06:39 GMT

మరో బిడ్డకు జన్మనివ్వబోతున్న కిరణ్ అబ్బవరం దంపతులు.. నిజమెంత?

2026-11-10 06:33 GMT

దర్శకుడి నుంచి నిర్మాతగా.. వెంకీ కుడుముల సినీ ప్రయాణంలో ఆసక్తికర విషయాలు!

2026-11-10 06:13 GMT

Copyright @2026

Powered by Blink CMS