• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  డౌట్‌ లేకుండా సౌత్‌ లో...

డౌట్‌ లేకుండా సౌత్‌ లో నెం.1 రష్మిక

By - Tupaki Desk
Update: 2021-10-31 12:30 GMT
కన్నడ సినిమాలతో ఇండస్ట్రీకి పరిచయం అయ్యి తెలుగు లో ఛలో సినిమా తో ఎంట్రీ ఇచ్చి మొదటి విజయాన్ని సొంతం చేసుకుని గీత గోవిందం సినిమా తో ఒక్కసారిగా టాలీవుడ్ లో టాప్ స్టార్‌ హీరోయిన్ గా మారిపోయిన రష్మిక మందన్న ప్రస్తుతం కన్నడం.. తెలుగు సినిమా ల్లో మాత్రమే కాకుండా తమిళం మరియు హిందీ సినిమాల్లో కూడా నటిస్తోంది. పెద్ద ఎత్తున ఈ అమ్మడి సినిమాలు బాక్సాఫీస్ వద్ద బిగ్గెస్ట్‌ సక్సెస్ లు గా నిలుస్తున్నాయి. ఇదే సమయంలో ఈ అమ్మడు ఇన్‌ స్టా గ్రామ్ లో చూపిస్తున్న దూకుడు కూడా ఈమెను సౌత్‌ లో నెం.1 హీరోయిన్ గా మార్చేసింది. ఇన్ స్టా గ్రామ్ లో ఈ అమ్మడికి 23.3 మిలియన్ ల ఫాలోవర్స్ ఉన్నారు. సౌత్‌ లో స్టార్‌ హీరోయిన్స్ గా వెలుగు వెలుగుతున్న ఏ ముద్దుగుమ్మకు ఈ స్థాయి ఫాలోవర్స్ లేరు అనడంలో సందేహం లేదు.

కేవలం 394 ఇన్‌ స్టా పోస్ట్‌ లతో రష్మిక మందన్నా సౌత్‌ లోనే టాప్‌ ఇన్ స్టా స్టార్‌ గా నిలిచింది. వెయ్యికి పైగా పోస్ట్ లు పెట్టిన కాజల్ అగర్వాల్‌ ఇంకా 20 మిలియన్ ల ఫాలోవర్స్ వద్దే ఉంది. ఇక ఆమె ఫాలోవర్స్‌ సంఖ్య పెరిగే అవకాశం కూడా పెద్దగా లేదంటున్నారు. ఎందుకంటే ఆమె పెళ్లి చేసుకుంది.. సినిమాలు కూడా గతంలో మాదిరిగా ఆమెకు అంతగా రావడం లేదు. ఇక ఇతర హీరోయిన్స్‌ కూడా రష్మిక కు చాలా వెనుక ఉన్నారు. కనుక రాబోయే రోజుల్లో కూడా రష్మికనే సౌత్‌ లో నెం.1 స్టార్‌ హీరోయిన్ అని అభిమానులు అంటున్నారు. ఫాలోవర్స్ విషయంలో చూస్తే ఏమాత్రం డౌట్ అక్కర్లేకుండా సౌత్ లో మోస్ట్‌ క్రేజీ బ్యూటీఫుల్‌ హాట్‌ అందాల తార రష్మికనే నెం.1 అంటూ అభిమానులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

నెట్టింట ఈమె జోరు మామూలుగా లేదు. అందమైన ఫొటోలను రెగ్యులర్ గా కాకున్నా అప్పుడప్పుడు షేర్‌ చేస్తూ తన ఫాలోవర్స్ కు ఫుల్‌ వింధు ఇచ్చే ముద్దుగుమ్మ రష్మిక మందన్నా ఇప్పుడు వరుస సినిమాలతో బాక్సాఫీస్‌ వద్ద సందడికి సిద్దం అవుతోంది. ఈమె నటించిన పుష్ప పార్ట్‌ 1 డిసెంబర్‌ లో ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెల్సిందే. మరో వైపు శర్వానంద్‌ తో కలిసి నటిస్తున్న ఆడవాళ్లు మీకు జోహార్లు సినిమా వచ్చే ఏడాది ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. హిందీలో ఈమె గుడ్ బై మరియు మిషన్ మంజు సినిమాల్లో నటిస్తోంది. అమితాబచ్చన్‌ తో కలిసి ఈ అమ్మడికి నటించే అవకాశం దక్కింది. దాంతో ముందు ముందు బాలీవుడ్‌ లో ఈమె మోస్ట్‌ బిజీ హీరోయిన్ అవ్వడం ఖాయం అంటున్నారు. మరో వైపు తమిళంలో కూడా స్టార్‌ హీరోల సినిమా ల్లో ఈమె నటిస్తోంది. ఇక కన్నడంలో కూడా సినిమాకు కమిట్ అయ్యిందనే వార్తలు వస్తున్నాయి.
Tags:    
  • Rashmika Mandana 
  • Tollywood 
  • Movie News 
  • Latest News 
  • Telugu News 

Similar News

మారుతోన్న హీరోయిన్ల ప్రాధాన్య‌త‌!

2026-11-18 17:30 GMT

టాలీవుడ్‌లో రేణుదేశాయ్ ఆ తరహా పాత్రలకు ఓకే చెప్పేనా?

2026-11-18 16:30 GMT

డబ్బింగ్ సినిమాలకు పోటీ పడుతున్న టాలీవుడ్‌ బడా నిర్మాతలు!

2026-11-18 15:30 GMT

బాలీవుడ్ హీరోయిన్ల పోస్ట్-ప్రెగ్నెన్సీ ఫిట్‌నెస్ & ట్రెండ్స్!

2026-11-18 14:30 GMT

అసలు అనుష్క నెక్స్ట్ ప్లాన్ ఏంటి!

2026-11-18 13:30 GMT

వృషకర్మ కోసం భారీ సెట్స్.. ఆర్ట్ డైరెక్టర్ నాగేంద్ర ఇంటర్వ్యూ

2026-11-18 12:45 GMT

అంగరంగ వైభవంగా పెళ్లిళ్లు.. ఆపై సైలెంట్‌గా విడాకులు!

2026-11-18 12:30 GMT

అన్ని రకాల జంతువులను రుచి చూశా.. ఆయన వల్లే సాధ్యం అంటున్న శృతిహాసన్!

2026-11-18 11:30 GMT

చిరు, నాగ్‌ను చూసి యంగ్‌ హీరోలు నేర్చుకోవాలి!

2026-11-18 11:19 GMT

స్టార్ హీరో వైఖ‌రి దారుణం అంటూ వాపోయిన న‌టి

2026-11-18 11:11 GMT

'రణబాలి' లో ఆ ఒక్కటి మిస్ అయిందా?

2026-11-18 10:30 GMT

25 ఏళ్ల త‌ర్వాత మ‌ళ్లీ హిట్ జోడీ!

2026-11-18 10:01 GMT

Copyright @2026

Powered by Blink CMS