పుష్పను తెగ వాడేసుకుంటోంది...
సరైన టైమ్ లో సరైన హిట్ ఆమెకు పడింది. అసలే గట్టి పోటీ ఉన్న వేళ ఇలాంటి బంపర్ హిట్ అంటే నిజంగా ఎవరికైనా హుషారే మరి. ప్రస్తుతం కన్నడ కస్తూరి రష్మిక మందన అదే ఎంజాయ్ చేస్తోంది. పుష్ప మూవీ అంతా అల్లు అర్జున్ వన్ మాన్ షో మాదిరిగా సాగిపోయింది. ఇక ఇందులో హీరోయిన్ గా రష్మిక డీ గ్లామరైజ్ రోల్ ప్లే చేసింది. అయితేనేమి ఈ మూవీ హిట్ తో ఆమె తన ప్లేస్ ఎక్కడో చెప్పేస్తోంది.
టాలీవుడ్ లో తనకు గట్టి సవాల్ చేస్తున్న పూజా హెగ్డేని దాటేశాను అనుకుంటోంది. ఇక పుష్ప ప్రమోషన్స్ లో తన గ్లామర్ ని ఒక్క లెక్కన ఆరబోసి మొత్తానికి మొత్తం ఇండియన్ మీడియాను తన వైపు తిప్పుకున్న రష్మిక బాలీవుడ్ లో తన ఆశలను పెంచుకోవడానికి గట్టిగానే ట్రై చేస్తోంది. పుష్ప ప్రమోషన్స్ లో రష్మిక సొగసు చూడతరమా అంటూ దూకుడు చేసింది.
హీరో అల్లు అర్జున్ తో పాటు ఆమె దేశమంతా తిరిగి మీడియాకు మెయిన్ అట్రాక్షన్ అయిపోయింది. అంతే కాదు బాలీవుడ్ మీడియా అటెన్షన్ మొత్తం తన వైపు ఉండేలా చేసుకుంది. తనలోని గ్లామర్ సత్తా ఏంటో లోకానికి అలా చాటింపు వేసేసింది. ఈ మూవీ తరువాత తన నెక్స్ట్ స్టెప్ బాలీవుడ్ లో జెండా గట్టిగా పాతేయడమే అని స్ట్రాంగ్ గా డిసైడ్ అయిన అమ్మడు ఆ దిశగా తన ప్రయత్నాలు ముమ్మరం చేసింది.
పుష్ప ఒక విధంగా రష్మికకు బాగా ధీమా ఇచ్చిందని చెప్పాలి. ముఖ్యంగా టాలీవుడ్ లో చూసుకుంటే పూజా హెగ్డె నామస్మరణం చేసిన మేకర్స్ కి రష్మిక ఇపుడు కళ్ళెదుట సాక్షాత్కరించింది అనుకోవాలి. చిత్రమేంటి అంటే పూజా, రష్మిక ఇద్దరూ కన్నడ భామలే. ఇద్దరికీ టాలీవుడ్ లోనే హిట్లు దక్కాయి. అయింతే ఇద్దరి చూపూ బాలీవుడ్ మీదనే ఉంది.
టాలీవుడ్ ని నిచ్చెనలా చేసుకుని బాలీవుడ్ ని ఏలాలని ఈ కన్నడ ముద్దు గుమ్మలు చేస్తున్న ప్రయత్నాలు ఎంత వరకూ ఫలిస్తాయో తెలియదు కానీ టాలీవుడ్ మాత్రం ఇద్దరికీ అద్భుతమైన కెరీర్ నే ఇచ్చింది అని కచ్చితంగా చెప్పుకోవాలి. అయితే టాలీవుడ్ కి ఈ ఇద్దరు ఎంత వరకూ ఇంపార్టెన్స్ ఇస్తారు అన్నది కూడా ఆలోచించాలి.
మొత్తానికి పాన్ ఇండియా స్టార్ కావాలని పుష్ప మూవీతో తన ప్రయత్నం అల్లు అర్జున్ చేస్తే ఆయనతో సరిసమానంగా తన టాలెంట్ ని గ్లామర్ ని ముందు పెట్టి బాలీవుడ్ లో దూసుకుపోవాలని రష్మిక చూస్తోంది. అమ్మడు ముందు చూపుకు, ఆమె ఫ్యూచర్ ప్లాన్స్ కి హాట్సాఫ్ అని చెప్పాల్సిందే. అయితే టాలీవుడ్ లో ఆఫర్స్ ని పక్కన పెట్టి బాలీవుడ్ కి వెళ్ళి చతికిలపడిన భామలను ముందుగా గుర్తుకు తెచ్చుకుని జాగ్రత్తగా అడుగులు వేయడమే బెటర్ అన్న సూచనలు అయితే ఈ ముద్దుగుమ్మకు అందుతున్నాయి.