#సామి సామీ.. పార్టీకి ఆహ్వానించిన రష్మిక
`పుష్ప- ది రైజ్` నుంచి `సామి సామి..` సాంగ్ ఎంతగా క్లిక్కయ్యిందో తెలిసిందే. ఇటీవలి కాలంలో చార్ట్ బస్టర్ గా నిలిచిన ఈ పాటకు రష్మిక సిగ్నేచర్ స్టెప్ కూడా అంతే కనెక్టయ్యింది. అల వైకుంఠపురములో పాటలకు యూత్ పిచ్చిగా సిగ్నేచర్ స్టెప్స్ కోసం ప్రయత్నించారు. ఆసీస్ క్రికెటర్ వార్నర్ లాంటి వాళ్ల మార్ఫింగ్ వీడియోల సందడి తెలిసిందే. ఏదైనా పాట క్లిక్ అయితే దానికి ఉండే ఫాలోయింగ్ వేరే లెవల్లో ఉంటుందనడానికి ఇవన్నీ ఎగ్జాంపుల్స్.
ప్రస్తుతం యువతరం వాట్సాపుల్లో ఎక్కువగా షేర్ అవుతున్న సాంగ్ బిట్ సామి సామి... టకా టక్ .. టిక్ టాక్ సహా పలు యాప్ లలో ఈ పాట అంతే రైజింగ్ గా దూసుకెళుతోంది. యూత్ అనుకరణ ఆసక్తిని కలిగిస్తోంది. పుష్ప డిసెంబర్ 17న గ్రాండ్ రిలీజ్ కి సిద్ధమవుతోంది. విడుదలకు ముందే రష్మిక పార్టీలో చేరారు.
ఇది గెట్ టుగెదర్ పార్టీ అనుకుంటే తప్పులో కాలేసినట్టే. రష్మిక తన పాట -సామి సామి పాటకు స్టెప్పులేసిన వీడియోని షేర్ చేసింది. బ్లాక్ టీషర్ట్ - డెనిమ్ షార్ట్ ధరించి అదిరిపోయే హుక్ స్టెప్ తో కట్టి పడేసింది. టకాటక్ సహా పలు యాప్ లలో చాలా మంది నెటిజనులు ఈ పాటకు స్టెప్ లు వేయడం తాను చూశానని ఆ విధంగా తాను కూడా పార్టీలో చేరానని రష్మిక వెల్లడించింది.
``మీలో చాలా మంది ఈ రీల్ చేయడం నేను చూస్తున్నాను. నేను కూడా పార్టీలో చేరాలని కోరుకున్నాను... కాబట్టి నేనే ఒకటి తయారు చేసాను... మీలో ఇంకా చాలా మంది మా మాస్ పార్టీలో చేరాలని ఆశిస్తున్నాను`` అని వ్యాఖ్యను జోడించింది ఈ వీడియోతో.
ఇతరులను పార్టీలో చేరమని కోరుతూ బహిరంగ ఆహ్వానాన్ని పంపింది. బన్ని లాంటి ఎనర్జిటిక్ స్టార్ సరసన నటిస్తున్నందుకు ఆనందం వ్యక్తం చేసింది రష్మిక. పుష్పతో పాటు రష్మిక బాలీవుడ్ లో `మిషన్ మజ్ను`.. గుడ్‌బై అనే రెండు చిత్రాలను చేస్తోంది.