నెటిజ‌న్ ‌ల‌కి అడ్డంగా దొరికిన ర‌ష్మిక

Update: 2021-09-28 15:34 GMT
టైమ్ ఎవ‌రిని ఎప్పుడు ప‌రుగులు పెట్టిస్తుందో.. అంద‌లం ఎక్కిస్తుందో ఎవ‌రూ చెప్ప‌లేరు.. ర‌ష్మిక మంద‌న్న విష‌యంలోనూ అదే జ‌రుగుతోంది. `ఛ‌లో` మూవీతో తెలుగు ప్రేక్ష‌కుల్ని త‌న మాయ‌లోప‌డేసిన ఈ క‌న్న‌డ సోయ‌గం అన‌తి కాలంలోనే టాలీవుడ్ ‌లో టాప్ హీరోల‌తో క‌లిసి న‌టించే ఛాన్స్‌ ని సొంతం చేసుకుని ఊహించ‌ని స్థాయిలో స్టార్ హీరోయిన్ ల జాబితాలో చేరిపోయింది.

తెలుగ‌లో టాప్ ఐకాన్ స్టార్‌ తో క‌లిసి పాన్ ఇండియా ప్రాజెక్ట్ `పుష్ప‌`లో న‌టిస్తున్న ర‌ష్మిక ఇదే ఏడాది బాలీవుడ్ కు త‌న మ్యాజిక్‌ ని ప‌రిచ‌యం చేయ‌బోతోంది. `మిష‌న్ మ‌జ్ను` చిత్రం ద్వారా బాలీవుడ్ ప్రేక్ష‌కుల్ని ప‌ల‌క‌రించ‌బోతోంది. ఇప్ప‌టికే పూర్తయిన ఈ మూవీ పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ కార్య‌క్ర‌మాలు జ‌రుపుకుంటోంది. ఈ మూవీతో పాటు బిగ్‌ బీ అమితాబ్ బ‌చ్చ‌న్ తో క‌లిసి మ‌రో సినిమాలో న‌టిస్తోంది.

అంతేనా.. వ‌రుస బ్రాండ్ ‌ల‌కు ప్ర‌చార క‌ర్త‌గా ఎంపిక అవుతూ రికార్డు సృష్టిస్తోంది. విజ‌య్ దేవ‌ర‌కొండ‌తో క‌లిసి వ‌రుస క‌మ‌ర్షియ‌ల్ యాడ్ ‌లలో అల్ల‌రి చేసిన ర‌ష్మిక తాజాగా దూకుడు పెంచేసింది. విక్కీ కౌశ‌ల్ ‌తో క‌లిసి అండ‌ర్ గార్మెంట్ బ్రాండ్ మాకో ప్ర‌క‌ట‌నలో న‌టించింది. తాజాగా దీనికి సంబంధించిన యాడ్ విడుద‌లైంది. ఇందులో ర‌ష్మిక .. హీరో విక్కీ కౌశ‌ల్ అండ‌ర్ వేర్ ప‌ట్టీని చూస్తూ క‌నిపించ‌డం ప‌లు విమ‌ర్శ‌ల‌కు తావిస్తోంది.

ఈ త‌ర‌హా యాడ్‌ లో రౌడీ బేబీని చూసిన నెటిజ‌న్స్ ఆమెని అడ్డంగా బుక్ చేస్తూ ట్రోల్ చేస్తున్నారు. ఈ యాడ్ ప్ర‌చారం ద్వారా స‌మాజానికి త‌ప్పుడు సందేశాన్ని ఇస్తున్నావ‌ని సెటైర్లు వేస్తున్నారు. `ఈ మాచో ప్ర‌క‌ట‌న చాలా క‌ష్టంగా వుంది. గీతా మీ నుంచి ఇలాంటి చ‌వ‌క‌బారు ప్ర‌క‌ట‌న‌ని ఆశించ‌లేదు` అంటూ కొంత మంది అభిమానులు కూడా ర‌ష్మిక‌ని విమ‌ర్శిస్తున్నారు.

Full View
Tags:    

Similar News