ఎక్కడ పడితే అక్కడ రష్మిక ఆ స్టెప్స్‌

Update: 2021-12-21 07:34 GMT
పుష్ప సినిమా విడుదల అయ్యి మిశ్రమ స్పందనతో బాక్సాఫీస్ వద్ద మంచి వసూళ్లను నమోదు చేస్తున్నాయి. అంతా కూడా సినిమా లో అల్లు అర్జున్ యాక్షన్‌ మరియు నటన.. సమంత ఐటెం సాంగ్ మరియు రష్మిక మందన్నా యొక్క గ్లామర్ గురించి మాట్లాడుకుంటున్నారు. సినిమా ప్రమోషన్స్ విడుదలకు ముందు.. విడుదల తర్వాత కూడా జోరుగా సాగుతూనే ఉన్నాయి.

సుకుమార్ దర్శకత్వంలో రూపొందిన ఈ సినిమా అల్లు అర్జున్‌ ను చాలా కొత్తగా చూపించిందని అభిమానులు అంటున్నారు. ఇదే సమయంలో సమంత అభిమానులు కూడా ఐటెం సాంగ్‌ లో చూసి ఆనందం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి మాస్ మసాలా పుష్ప రెగ్యులర్‌ గా సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతూనే ఉంది.

రష్మిక మందన్న ఈ సినిమాలో సామి సామి నా బంగారు సామి అంటే వేసిన డాన్స్ అందరి దృష్టిని ఆకర్షించింది. సినిమా విడుదలకు ముందు నుండే ఈ పాటలోని ఒక స్టెప్పు బాగా పాపులర్ అయ్యింది. బెండ్‌ అయ్యి బ్యాక్ ను షేక్ చేస్తూ చేతులు ఆడించే ఆ స్టెప్‌ ను రష్మిక పలు సందర్బాల్లో వేసింది. ఇటీవల బిగ్‌ బాస్ షో లో కూడా ఆమె ఆ స్టెప్‌ వేయడం జరిగింది.

ఆ తర్వాత పలు ఇంటర్వ్యూల్లో.. అంతుకు ముందు పలు షో ల్లో కూడా రష్మిక మందన్నా ఆ స్టెప్పును చేసి చూపించింది. చాలా చోట్ల రష్మిక ఆ పాటకు స్టెప్పు వేయడంతో నెట్టింట మీమ్స్ పడుతున్నాయి. రష్మిక పుష్ప ప్రమోషన్ అనగానే వెంటనే ఆ స్టెప్‌ వేసేందుకు సిద్దం అయి పోతుంది అంటూ మీమ్స్‌ కుప్పలు తెప్పలుగా పడ్డాయి.

సామి సామి పాట వినడానికి మరియు చూడ్డానికి కూడా చాలా బాగుందనే అభిప్రాయం అందరిలో ఉంది. అయితే ఆ పాట స్టెప్‌ ను ఇలా ఎక్కడ పడితే అక్కడ వేయడం అవసరమా అన్నట్లుగా కొందరు బన్నీ అభిమానులు మరియు ఇండస్ట్రీ వర్గాల వారు రష్మికను ఉద్దేశించి అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అల్లు అర్జున్‌ ఈ సినిమాలో ఎంత మాస్ గా కనిపించాడో అంతే మాస్ గా రష్మిక కనిపించింది.

అయితే ఆమె అలా కూడా గ్లామర్ షో చేసింది. ఆమె అందాల ప్రదర్శణ పాటల సమయంలో తగ్గలేదు అనడంలో సందేహం లేదు. మొత్తానికి ఈ అమ్మడు పుష్ప తో మరింత మంది అభిమానులను దక్కించుకుంది. పాన్ ఇండియా లెవల్‌ లో విడుదల అయిన ఈ సినిమా రష్మికకు ఉన్న గుర్తింపును పెంచింది అనడంలో సందేహం లేదు. హీరోయిన్ గా రష్మిక ప్రస్తుతం తెలుగు.. తమిళం.. కన్నడం మరియు హిందీ సినిమాల్లో నటిస్తూ చాలా బిజీగా ఉంది.
Tags:    

Similar News