• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  మ‌ళ్లీ మెగా కాంపౌండ్లోకి...

మ‌ళ్లీ మెగా కాంపౌండ్లోకి వెళ్తున్న‌ రాశీ..?

By - Tupaki Desk
Update: 2021-01-24 08:00 GMT
‘రాశీఖ‌న్నా..’ ఈ పేరు తెలియ‌ని తెలుగు సినిమా ప్రేక్ష‌కుడు ఉండ‌రంటే అతిశ‌యోక్తి కాదు. ‘ఊహలు గుసగుసలాడే’ అంటూ కుర్రకారు గుండెల్లో కొత్త ఆశలు రేకెత్తించిందీ ఢిల్లీ బ్యూటీ. ఈ అమ్మ‌డు టాలీవుడ్లోకి అడుగు పెట్టి దాదాపు ఆరేళ్ల పైనే అయ్యింది. అగ్ర హీరోల సరసన నటించే అవకాశం రాకపోయినా.. కుర్ర హీరోల‌తో తనదైన పాత్రలు చేసి అందరినీ ఆకట్టుకుంది.

అయితే.. చాలా కాలంగా టాలీవుడ్ లో ఉన్నప్పటికీ.. ఈ అమ్మడుకి అనుకున్న స్థాయిలో అవకాశాలు రాలేదు. ‘వరల్డ్ ఫేమస్ లవర్’ తరువాత మరో సినిమాకు సంతంకం చేయలేదు రాశీ. అయితే.. టాలీవుడ్‌లో అవకాశాలు పెద్దగా లేకున్నా, తమిళంలో మాత్రం జోరు కొనసాగిస్తోంది. వరుస సినిమాలతో కోలీవుడ్లో చక్రం తిప్పుతోందీ భామ.

అయితే.. తాజాగా టాలీవుడ్లో ఈ భామకు మరో బంపర్‌ ఆఫర్‌ వచ్చిందట. మెగాహీరో సాయిధరమ్‌ తేజ్ సినిమాలో నటించే ఛాన్స్ కొట్టేసిందట. వరుణ్ తేజ్ తో తొలిప్రేమ సినిమాలో సందడి చేసిన రాశీ.. మరోసారి మెగా కాంపౌండ్లోకి అడుగు పెట్టిందని సమాచారం. ఈ చిత్రానికి సుకుమార్‌ శిష్యుడు దర్శకుడు. సరికొత్త జోనర్‌లో తెరకెక్కుతున్న ఈ సినిమాలో సాయితేజ్‌ సరసన రాశీఖన్నా హీరోయిన్‌గా ఎంపికైనట్లు తెలుస్తోంది.

కాగా.. మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌, రాశీ ఖన్నా కాంబోలో ఇప్పటికే రెండు సినిమాలు వచ్చాయి. అందులో ఒకటి సుప్రీం కాగా.. మరొకటి ప్రతిరోజూ పండగే. ఈ రెండు సినిమాలూ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. ఇప్పుడు మరోసారి జోడీ కట్టబోతున్న ఈ జంట.. హ్యాట్రిక్ పై కన్నేసింది. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుందని తెలుస్తోంది.
Tags:    
  • Raashi Khanna 
  • Raashi Khanna photoshoot 
  • Raashi Khanna Movies 
  • Raashi Khanna Latest Updates 

Similar News

Tupaki Exclusive: రుద్రవరం-పీఎస్ కథలో ఎన్నో ఆసక్తికర మలుపులు.. టీమ్ ఏమంటోంది?

2026-11-03 08:04 GMT

ఇండియన్ టాలెంట్‌పై హైబ్ కన్ను!

2026-11-03 07:52 GMT

Tupaki Exclusive: సమ్మర్ హాలిడేస్ మూవీ టీమ్‌తో స్పెషల్ ఇంటర్వ్యూ

2026-11-03 07:26 GMT

పదేళ్ల వయసులోనే గొప్పగా ఊహించుకున్నా.. కానీ!

2026-11-03 07:22 GMT

‘రామాయణ’కు బాంబే హైకోర్టు రక్షణ!

2026-11-03 07:15 GMT

ఇన్నాళ్లకు సెట్ లో అడుగుపెట్టిన నివేదా థామస్!

2026-11-03 07:05 GMT

రాజమౌళి మొదటి సారి యాక్షన్ చెప్పిన తర్వాత ఏం చేశాడో తెలుసా?

2026-11-03 06:58 GMT

ఇత‌ర న‌టుల‌ను వ‌దిలేసి దియా వీడియోనే ఎందుకు తొల‌గించారు? ప్ర‌భుత్వంపై విమ‌ర్శ‌లు!

2026-11-03 06:58 GMT

తెలుగు సినిమాలకు ఇప్పుడు ఈ మంత్రం ఒక్కటే అసలైన ప్రమోషన్!

2026-11-03 06:56 GMT

‘కన్నప్ప’కు రాస్తే.. ‘రామాయణం’లో ఛాన్సొచ్చింది

2026-11-03 05:53 GMT

తొలి సంపాదనతో రాజమౌళి ఏం కొన్నారో తెలుసా?

2026-11-03 05:38 GMT

అతని హీరోగా వస్తే.. అందరూ వెళ్ళిపోతారనుకున్నారంట!

2026-11-03 04:47 GMT

Copyright @2026

Powered by Blink CMS