రారండోయ్ కి పబ్లిసిటీ అదిరిందిగా!!

Update: 2017-05-23 18:00 GMT
రా రండోయ్ వేడుక చూద్దాం మూవీ ఇప్పుడు హాట్ టాపిక్ అయిపోయింది. ఈ శుక్రవారం రిలీజ్ కానున్న రారండోయ్ చిత్రంపై మంచి అంచనాలు ఏర్పడినా.. ఇంత బజ్ క్రియేట్ కావడానికి మాత్రం చలపతిరావు సృష్టించిన వివాదమే కారణం.

'అమ్మాయిలు నిజంగా మనశ్శాంతికి హానికరమా' అని అడిగిన ప్రశ్నకు.. 'అమ్మాయిలు హానికరం కాదు కానీ.. పక్కలోకి పనికొస్తారు' అని కేరక్టర్ నటుడు చలపతిరావు చేసిన కామెంట్స్ గట్టి దుమారమే రేపాయి. ఈ కామెంట్స్ ను ఖండిస్తూ నాగార్జున.. నాగచైతన్య ట్వీట్స్ కూడా పెట్టేశారు. రామ్ లాంటి యంగ్ హీరోలు చిన్నపాటి స్టేట్మెంట్స్ కూడా ఇచ్చారు. ఇక చలపతిరావును తిట్టిపోసేసేవారి సంఖ్య కూడా తక్కువేమీ లేదు. మరోవైపు చలపతి రావు కూడా మా అసోసియేషన్ తరఫున ప్రెస్ మీట్ పెట్టి మరీ యాంకర్ పై ఎదురుదాడి చేశాడు.

ఇవన్నీ కలిసి రారండోయ్ వేడుక చూద్దాం చిత్రాన్ని వార్తల్లో విపరీతంగా వార్తల్లో నిలిపేశాయి. సినిమా ట్రైలర్ రిలీజ్ అయినపుడు.. ఆడియో విడుదల చేసినపుడు.. ఈ సారి కూడా బ్లాక్ బస్టర్ కొడుతున్నాం అని నాగార్జున అన్నపుడు కానీ క్రియేట్ కాని హైప్.. చలపతిరావు చేసిన ఒక్క వివాదాస్పద డైలాగ్ తో వచ్చేయడం విశేషం.
Tags:    

Similar News