ప్రపంచకప్ గెలిచిన రోజే 83 మూవీ రాబోతుందా..??
బాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న బడా సినిమాలు సూర్యవంశీ, 83. ఇందులో సూర్యావంశీ చిత్రం 2021 ఏప్రిల్ 2న విడుదల కానుందని ఇదివరకే వార్తలొచ్చాయి. అయితే కరోనా వైరస్ సంఖ్య తగ్గిన తరువాత, సినిమా హాళ్ళను 100% ఆక్యుపెన్సీలో రన్ చేయడానికి కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చిన తర్వాత సూర్యావంశీ టీమ్ రిలీజ్ డేట్ ప్రకటించారు. రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తున్న ఈ సినిమాతో పాటు మరో బిగ్ మూవీ 83.. ఈ సినిమాను త్వరలో సినిమాహాళ్లలో విడుదల చేయాలని మేకర్స్ నిర్ణయించినట్లు తెలుస్తుంది. తాజా సమాచారం ప్రకారం.. 83 సినిమాను జూన్ నెలలో విడుదల చేయాలని నిర్ణయించుకున్నారట. ఏప్రిల్ 2న సూర్యవంశి విడుదల అవుతోంది కాబట్టి 83 రిలీజ్ సాధ్యం కాదు.
అలాగే ఏప్రిల్ 12 నుండి రంజాన్ మాసం మొదలవుతుంది కాబట్టి ఏప్రిల్ నెలను తోసిపుచ్చింది. ఇంకా మే నెలలో రెండు భారీ సినిమాలు రాధే, సత్యమేవ జయతే 2 విడుదల అవుతుండగా.. అందుకే 83కి జూన్ మంచి టైం అని భావిస్తున్నారట. భారత క్రికెట్ జట్టు 1983 ప్రపంచ కప్ గెలిచిన రోజు జూన్ 25న.. కాబట్టి అదే తేదిన 83 విడుదల కావచ్చని నివేదికలు చెబుతున్నాయి. ఈ సినిమాలో దీపిక పదుకొనే రన్వీర్ జంటగా నటిస్తోంది. కబీర్ ఖాన్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను రిలయన్స్ ఎంటర్టైన్మెంట్స్ నిర్మిస్తోంది. అయితే కపిల్ దేవ్ బయోపిక్ లా తెరకెక్కుతున్న ఈ సినిమాను కేవలం హిందీ భాషలో మాత్రమే కాకుండా దక్షిణాది భాషలలో కూడా ప్లాన్ చేసి పాన్ ఇండియా సినిమాగా రిలీజ్ చేయాలనీ మేకర్స్ ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తుంది. అయితే జూన్ అనుకుంటున్నారు గాని ఇది 25నే వస్తుందనే గ్యారంటీ లేదు. అంతకుముందు వెనక ఎప్పుడైనా రావచ్చు. చూడాలి మరి 83 టీమ్ ఏం చేస్తుందో!