డైరెక్టర్‌కి రజనీ సూపర్‌షాక్‌

Update: 2015-07-03 07:42 GMT
సూపర్‌స్టార్‌ రజనీకాంత్‌ వయసెంతో నటుడిగా అతడి అనుభవం కూడా అంత. అమ్మ కడుపులో ఉండగానే యాక్టింగ్‌ నేర్చుకున్న బిడ్డడు. ఆ బ్లడ్‌లోనే నటన ఉంది. అందుకే ఎలాంటి క్లిష్టమైన సీన్‌ ఇచ్చినా నమిలేస్తాడు. అంత పెద్ద సూపర్‌స్టర్‌కి ఈ పొగడ్త సరిపోదు. ఆరు దశాబ్ధాల పాటు దక్షిణాది సినీపరిశ్రమని ఏలిన మహారాజా అతడు. అయితే అంతటి మహారాజాకి నటనలో ఓనమాలు నేర్పాలా? ఇంకా ట్రైనింగ్‌ క్లాసులు చెప్పాల్సిన అవసరం ఉందా? ఊహించడానికే వింతగా ఉంది కదూ...

కానీ అలాంటి సందర్భం రానే వచ్చింది. రజనీ తనంతట తానుగానే నటశిక్షణకు విచ్చేశాడు. ఓ కొత్త దర్శకుడు సమక్షంలో శిక్షణ తీసుకున్నాడు. అంతేకాదు అప్పటికే అక్కడ శిక్షణ పొందుతున్న సహనటీనటులందరికీ షాకిచ్చాడు. ముఖ్యంగా దర్శకుడు రంజిత్‌ ఆ షాక్‌ నుంచి ఇప్పటికీ తేరుకోలేకపోతున్నాడు. వివరాల్లోకి వెళితే.. త్వరలోనే రజనీతో రంజిత్‌ సినిమా షూటింగ్‌కి రంగం సిద్ధం చేస్తున్నారు. కానీ రంజిత్‌కి ప్రీప్రాక్టికల్స్‌, ప్రీప్రాక్టీస్‌ అనే ఫోబియో ఉంది. ఏ సినిమా తీసినా నటీనటులందరినీ ముందే ట్రైనప్‌ చేస్తుంటాడు. ఇప్పటికే అతడు తెరకెక్కించిన అటకత్తి, మద్రాస్‌ చిత్రాలకు అదే చేసి సక్సెస్‌ సాధించాడు. రెండు వరుస విజయాలు అతడికి ఈ డెడికేషన్‌ వల్లే వచ్చాయన్నది వాస్తవం. ఇప్పుడు తన మూడో సినిమాకి కూడా అదే చేశాడు. అయితే అనూహ్యంగా ప్రాక్టీస్‌ సెషన్స్‌కి రజనీ విచ్చేసి అందరితోపాటు ప్రాక్టీస్‌ చేసి షాకిచ్చాడంతే. ఇలాంటిది అరుదైన ఘటన. అందుకే ఈ ఊహించని షాక్‌.

Tags:    

Similar News