‘రంగ్ దే’ పబ్లిసిటీ కోసం ఆ డేట్ ఎంచుకున్నారా?
నితిన్ హీరోగా కీర్తి సురేష్ హీరోయిన్ గా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రం రంగ్ దే. హీరో నితిన్ ఇటీవలే భీష్మ చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మంచి విజయాన్ని దక్కించుకున్న నేపథ్యంలో ప్రేక్షకుల్లో రంగ్ దే చిత్రంపై అంచనాలున్నాయి. నితిన్ సినిమా కోసం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అందుకే మరింత ఆలస్యం చేయకుండా సినిమాను పూర్తి చేయాలని టీం నిర్ణయించుకున్నారట. ప్రస్తుతం చకచక చిత్రీకరణ జరుపుతున్నారని తెలుస్తోంది.
మద్యలో నితిన్ పెళ్లి కోసం మూడు నాలుగు వారాలు బ్రేక్ తీసుకోనున్నాడు. ఆ తర్వాత మళ్లీ షూటింగ్ ప్రారంభించి జూన్ ఆరంభం వరకు షూటింగ్ ను పూర్తి చేయాలని దర్శకుడు వెంకీ షెడ్యూల్ చేసుకున్నాడట. జూన్ ఫస్ట్ వీక్ లేదా సెకండ్ వీక్ వరకు సినిమా షూటింగ్ పూర్తి అయితే నిర్మాణానంతర కార్యక్రమాలు పూర్తి అయ్యేందుకు మరో నెల పడుతుంది. అంటే జులై మొదటి లేదా రెండవ వారంకు సినిమా ఫస్ట్ కాపీ వచ్చేస్తుంది. అయినా కూడా జులై 30న సినిమాను విడుదల చేయబోతున్నట్లుగా ప్రకటించారు. సినిమాను అంతా పూర్తి అయిన తర్వాత రెండు వారాు ఆలస్యంగా విడుదలకు కారణం ఏంటీ అంటూ కొందరు ప్రశ్నిస్తున్నారు.
జులై 30వ తారీకుకు చాలా ప్రత్యేకత ఉందనే విషయం తెల్సిందే. ఆ తేదీన జక్కన్న ఆర్‌ఆర్‌ఆర్ సినిమా విడుదల కాబోతుంది అంటూ ఏడాదికి పైగా ప్రచారం జరిగింది. అందుకే ఆ తేదీ తెలుగు ప్రేక్షకుల్లో బాగా నోటెడ్ అయ్యింది. ఇప్పుడు ఆ తేదీన రంగ్ దే వస్తుంది అంటే ఖచ్చితంగా పబ్లిసిటీ ఖాయం. ఆ ఉద్దేశ్యంతోనే ఆ తేదీని రంగ్ దే యూట్ ఫిక్స్ చేశారా అంటూ కొందరు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఉద్దేశ్యం ఏదైనా కూడా రంగ్ దే సినిమా ఆ రోజున వస్తే మాత్రం ఖచ్చితంగా విడుదలకు ముందు పాజిటివ్ బజ్ ను క్రియేట్ చేయడం ఖాయం అంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.