• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  ‘ఎక్స్’ వద్దంటే...

‘ఎక్స్’ వద్దంటే వద్దనేశాడట

By - Tupaki Desk
Update: 2016-11-02 04:46 GMT
సినీ నటుల ప్రేమలు ఎలా ఉంటాయో చెప్పాల్సిన అవసరమే లేదు. ఇక.. బాలీవుడ్ ప్రేమ జంటల సంగతి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది. హైదరాబాద్ లో వర్షం ఎప్పుడు కురుస్తుందో తెలీని చందంగా.. బీ టౌన్ లో ఎప్పుడు ఎవరు ఎవరిని ప్రేమిస్తారో.. ఎవరు ఎవరికి బ్రేకప్ చెబుతారో చెప్పలేని పరిస్థితి. ప్రేమ మైకంలో ఉన్నప్పుడు..పగలు రాత్రి అన్న తేడా లేకుండా తమ ప్రేమను పొంగించే ప్రేమపక్షులు.. కాస్త తేడా వచ్చినా ఎంతలా మారిపోతారో ఎన్నో జంటల్ని ఇప్పటికే చేతల్లో చూపించేశాయి. తాజాగా అలాంటి ముచ్చటే ఒకటి చోటు చేసుకుందట.

హాట్ హాట్ అందాలతో కుర్రకారు మనసుల్ని దోచేసి.. ట్రైలర్ తో నిద్ర లేని రాత్రిళ్లను మిగిల్చిన హాట్ ఆంటీ ఐష్ నటించిన తాజా చిత్రం.. ‘‘యే దిల్ హై ముష్కిల్’’. ఈ సినిమాలో హీరో రణబీర్ కపూర్ అయినా.. అతడి కంటే..ఐష్ గురించే అందరూ మాట్లాడుకున్నారు. ఇదిలా ఉంటే.. ఈ సినిమా విడుదలకు ముందు వేసిన ప్రీమియర్ షోకు.. ఈ చిత్ర నిర్మాత కరణ్ జోహార్ కు సన్నిహితురాలు.. రణ్ బీర్ ఎక్స్ గర్ల్ ఫ్రెండ్ కత్రినా కైఫ్ రాకపోవటం ఆసక్తికరంగా మారింది. అయితే.. కత్రినా గైర్హాజరీ వెనుక.. అసలు కారణం వేరే ఉందని చెబుతున్నారు.

కత్రినాతో బ్రేకప్ అయిన తర్వాత.. ఆమెకు దూరంగా ఉంటున్న రణ్ బీర్.. తన తాజా చిత్ర ప్రీమియర్ షోకు కత్రినాకు పిలవొద్దని నిర్మాత కరణ్ కు చెప్పాడట. ఆమె కానీ వస్తే.. తనకు సౌకర్యవంతంగా ఉండదని.. అందుకే ఆమెను ఇన్వైట్ చేయొద్దని తేల్చేశాడట రణ్ బీర్. అందుకే కరణ్.. కత్రినాను పిలవలేదని చెబుతున్నారు. ఎక్స్ అయిన తర్వాత కూడా మరీ అంత ఇబ్బందికరం ఏమిటో..?

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/
Tags:    
  • Ranbir Kapoor 
  • Katrina Kaif 
  • Ae dil hai mushkil Movie 

Similar News

రణ్‌బీర్‌కి ఇలా, యష్‌కి అలా…రామాయణం మూవీ వెనుక ఇంట్రెస్టింగ్ సీక్రెట్స్..!

2026-11-20 10:20 GMT

బ‌న్నీ రేసులో బోయ‌పాటి నెంబ‌ర్ - 4!

2026-11-20 10:20 GMT

పండంటి మగ బిడ్డకి జన్మనిచ్చిన సమంత.. కొడుకు పేరు ఏమిటంటే?

2026-11-20 09:21 GMT

సౌత్ ఇండ‌స్ట్రీపై రాజ‌మండ్రి బ్యూటీ సంచ‌ల‌న వ్యాఖ్య‌లు!

2026-11-20 09:21 GMT

Allu Aravind Three Stars: చిరు, చరణ్, బన్నీ..!

2026-11-20 08:28 GMT

'ఓం' మూవీ రివ్యూ

2026-11-20 08:27 GMT

తెలిసిన వారినే ప్రశ్నించడానికి ఎందుకు వెనుకాడుతున్నాం?

2026-11-20 08:23 GMT

సూపర్‌స్టార్ పక్కన చిన్నపిల్లలా అందాల రాశీఖ‌న్నా!

2026-11-20 07:38 GMT

తొలుత అర్థం కాలేదు.. తెలిశాక వివరించే ప్రయత్నం చేశా!

2026-11-20 07:36 GMT

మృత్యువు అంచుల నుంచి కాజల్ అగర్వాల్‌కు తప్పిన ప్రమాదం..!

2026-11-20 06:45 GMT

'గాడ్జిల్లా'పై 'రామాయ‌ణం' ఇంపాక్ట్ ఎంత‌?

2026-11-20 06:43 GMT

సొంత థియేటర్‌పై ఫిర్యాదు.. అల్లు అరవింద్ రియాక్షన్ చూస్తే ఫిదా అవ్వాల్సిందే!

2026-11-20 06:42 GMT

Copyright @2026

Powered by Blink CMS