అంద‌రూ మ‌హ‌మ్మారీ తీరిక‌లో పెళ్లాడితే ఈ హీరోగారు ఇలా అనేశారేమిటి!

Update: 2020-12-25 02:30 GMT
సంవత్సరాల పాటు ర‌క‌ర‌కాల‌ ఊహాగానాల తరువాత నటుడు రణబీర్ కపూర్ చివరకు ప్రియురాలు అలియా భట్ ని వివాహం చేసుకోవాలని ఆశిస్తున్నట్లు ధృవీకరించారు. మహమ్మారి పరిస్థితి లేనట్లయితే ఇద్దరూ ఈపాటికే పెళ్లి తంతు ముగించేవార‌ట‌.

సినీ జర్నలిస్ట్ రాజీవ్ మసంద్ కు ఇచ్చిన ఇంటర్వ్యూలో రణబీర్ కపూర్ ఈ విష‌యాన్ని ధృవీక‌రించారు. తన వ్యక్తిగత జీవితం గురించి పెళ్లి గురించి ఓపెన‌య్యారు ర‌ణ‌బీర్. మహమ్మారి మన జీవితాల్లో ప్ర‌వేశించ‌క‌పోయి ఉంటే.. పెళ్లాడేసేవాడినే అని రణబీర్ అన్నారు. ``నేను ఏదో ఒక‌టి చెప్పి స‌రిపుచ్చాల‌నుకోవ‌డం లేదు. నా జీవితంలో చాలా త్వరగా ఆ లక్ష్యాన్ని గుర్తించాలనుకుంటున్నాను`` అని అతను చెప్పాడు.

లాక్ డౌన్ సమయంలో రణబీర్- అలియా ఒకే చోట‌ నివశించారు. ఈ జంట వివాహం శుభ‌లేఖ‌లు అచ్చు వేయించే వ‌ర‌కూ వ‌చ్చింద‌ని కూడా నెలలుగా ఊహాగానాలు సాగాయి. ఎట్ట‌కేల‌కు ఈ జంట డీ-డేకి చేరువైంద‌ని ర‌ణ‌బీర్ స్వ‌యంగా చెప్పేశాడు.

లాక్ డౌన్ సమయంలో అతను ఏదైనా ఆన్ ‌లైన్ క్లాసులు తీసుకున్నాడా అని ప్ర‌శ్నిస్తే.. “నా స్నేహితురాలు అలియా కొంచెం ఎక్కువ సాధించింది. బహుశా అవ‌కాశం ఉన్న ప్రతి తరగతిని తీసుకుంది. గిటార్ నుండి స్క్రీన్ రైటింగ్ వరకు.. ప్ర‌తిదీ నేర్చుకుంది. నేను ఎప్పుడూ ఆమె పక్కన అండర్ అచీవర్ నే అని భావిస్తాను. కానీ నేను ఎటువంటి తరగతులకు వెళ్ల‌లేదు. ప్రారంభంలో మేము కుటుంబ ప‌రంగా సంక్షోభం త‌లెత్తింది. ఆపై నేను నా కుటుంబంతో గడిపాను. ప్రతిరోజూ రెండు-మూడు సినిమాలు చూస్తాను`` అని ర‌ణ‌బీర్ తెలిపారు.

అయాన్ ముఖర్జీ `బ్రహ్మాస్త్ర`లో ఆలియా- రణబీర్ కలిసి మొదటిసారి జంట‌గా న‌టించారు. ఇందులో అమితాబ్ బచ్చన్- నాగార్జున అక్కినేని- డింపుల్ కపాడియా కూడా నటించారు. ఈ సినిమా చిత్రీక‌ర‌ణ స‌మ‌యంలోనే ఆలియా-ర‌ణ‌బీర్ నిండా ప్రేమ‌లో మునిగారు. నిజానికి బ్యాచిల‌ర్లంద‌రికీ ఈ మ‌హ‌మ్మారీ సీజ‌న్ అన్ని ర‌కాలుగా క‌లిసొచ్చింది. చాలామంది పెళ్లితో ఓ ఇంటివాళ్ల‌య్యారు. కానీ ర‌ణ‌బీర్ మాత్రం అందుకు భిన్న‌మైన వెర్ష‌న్ చెబుతున్నాడు. బ‌హుశా అత‌డి తండ్రి రిషీజీ మ‌ర‌ణం బాధించ‌డం వ‌ల్ల‌నే ఈ పెళ్లిని వాయిదా వేసుకున్నాడ‌ని కూడా భావించాల్సి ఉంటుంది.
Tags:    

Similar News