• Home
  • Entertainment
  • News
  • Movie Reviews
  • Photos
  • Andhra Pradesh
    Anantapuramu Annamayya Anakapalli Alluri Sitharama Raju Bapatla Dr.B.R.Ambedkar Konaseema Eluru Kakinada NTR Parvathipuram Manyam Palnadu Sri Potti Sriramulu... Tirupati Chittoor East Godavari Guntur YSR Krishna Kurnool Nellore Nandyal
  • Telangana
  • Life Style
  • Sports
  • Lifestyle
  • Crime
  • legal
  • Astrology
  • Business
  • Gadgets
  • Real State
  • Insurance
  • Automobiles
  • Sports
  • Travel
  • Health
  • Education
  • Finance
  • Food
  • Gossip
  • OTT
EntertainmentLatest NewsMovie ReviewsPhoto GalleryAndhra PradeshTelanganaLife StyleSports
Home >  Entertainment >  రణరంగం ఈవెంట్ ఆ ఊరిలో..

రణరంగం ఈవెంట్ ఆ ఊరిలో..

By - Tupaki Desk
Update: 2019-07-28 11:03 GMT
శర్వానంద్ హీరోగా సుధీర్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం 'రణరంగం'.  ఈ సినిమాను ఆగష్టు 15 న రిలీజ్ చేసేందుకు నిర్మాతలైన సితార ఎంటర్టైన్మెంట్స్ వారు సన్నాహాలు చేస్తున్నారు.  ఇప్పటికే ఈ సినిమాకు ప్రమోషన్స్ ప్రారంభించారు. టీజర్.. ట్రైలర్లతో పాటుగా లిరికల్ సాంగ్స్ కూడా రిలీజ్ చేసి సినిమాపై ఆసక్తిని పెరిగేలా చేస్తున్నారు.  

ఇదిలా ఉంటే ఈ సినిమా ప్రీ రిలీజ్ కార్యక్రమానికి కూడా ప్లేసు ఫిక్స్ అయిందట.  మెజారిటీ సినిమా ఈవెంట్లు హైదరాబాద్ లోనే జరుగుతాయి కానీ ఈమధ్య తెలుగు రాష్ట్రాల్లోనే పలు నగరాల్లో ఈవెంట్లు నిర్వహించడం ఒక ట్రెండ్ గా మారింది.  ఆ ట్రెండ్ కు కొనసాగింపు అన్నట్టుగా 'రణరంగం' ఈవెంటును కాకినాడలో ప్లాన్ చేశారట.  దీనికి రెండు కారణాలు ఉన్నాయి.  'రణరంగం' లో కొన్ని ఇంపార్టెంట్ ఎపిసోడ్ల చిత్రీకరణ కాకినాడలోనే జరిగింది. అంతే కాకుండా ఈ నెలాఖరు నుండి ఓ రెండు వారాల పాటు బన్నీ - త్రివిక్రమ్ చిత్రం షూటింగ్ కాకినాడలోనే ప్లాన్ చేశారట.  రణరంగం నిర్మాతలు సితార ఎంటర్టైన్మెంట్స్.. బన్నీ సినిమా నిర్మాతలు హారిక హాసిని అధినేతలు ఒకరే కాబట్టి.. కాకినాడలో ఆగష్టు 4 న ప్రీరిలీజ్ ఈవెంట్ కు ప్లాన్ చేసుకున్నారట. అయితే కాకినాడలో ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిపినా హైదరాబాద్ లో మరో ఈవెంట్ జరుపుతారట.

గ్యాంగ్ స్టర్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో శర్వా రెండు షేడ్స్ ఉన్న పాత్రలో నటిస్తున్నాడు.  ఈ సినిమాలో కాజల్ అగర్వాల్.. కళ్యాణి ప్రియదర్శన్ హీరోయిన్లుగా నటించారు.  ఈ సినిమాకు సంగీత దర్శకుడు ప్రశాంత్ పిళ్ళై.  


Tags:    
  • Sharwanand 
  • Ranarangam Movie 
  • Telugu NEws 

Similar News

సినీ హీరోతో సారా టెండూల్క‌ర్ పెళ్లి కుదిరిందా?

2026-11-23 12:23 GMT

య‌శ్ ని మ‌ళ్లీ లంకేశ్వ‌రుడు లేపాడు!

2026-11-23 12:23 GMT

‘పెద్ది’ స్పెషల్ సాంగ్‌పై శ్రుతిహాసన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

2026-11-23 12:23 GMT

రెండేళ్ల నిరీక్షణకు తెర.. టెలివిజన్ ప్రీమియర్ కి సిద్ధమైన ‘దేవర’!

2026-11-23 12:22 GMT

మ్యూజిక్ సెన్సేష‌న్‌ని పెళ్లాడిన పాపుల‌ర్ గాయ‌ని!

2026-11-23 12:22 GMT

ENE రిపీట్ తో సత్తాచాటిన శ్రీనాథ్ మాగంటి తొలి రెమ్యునరేషన్ ఎంతంటే?

2026-11-23 11:03 GMT

చైతూ బీస్ట్ మోడ్.. 'వృషకర్మ' కోసం ఇంతలా!

2026-11-23 11:03 GMT

'దర్శకుడు' హీరో.. నిర్మాత అయ్యాడు

2026-11-23 11:03 GMT

ఎన్టీఆర్‌తో మూవీ... అనిల్ రావిపూడికి ప్రశాంతత లేదా?

2026-11-23 11:02 GMT

రామాయణం కోసం రెహ‌మాన్ త్యాగం!

2026-11-23 09:21 GMT

కిరణ్ అబ్బవరం నుంచి మరో క్రేజీ మూవీ.. 'రికార్డ్' రెడీ!

2026-11-23 09:20 GMT

కపూర్ ఇంట్లో సండే మస్తీ కజిన్స్ కోసం కిచెన్‌లోకి!

2026-11-23 09:20 GMT

Copyright @2026

Powered by Blink CMS