నా అఫైర్స్‌.. హెల్త్‌ పై మిహికకి ఫుల్‌ క్లారిటీ : రానా

Update: 2020-11-10 04:15 GMT
రానా అనగానే లవ్‌ బాయ్.. పార్టీ బాయ్‌ ఎక్కడ పార్టీలు జరిగినా కనిపిస్తూ ఉంటాడు. ఆయన ఎంతో మంది హీరోయిన్స్‌ తో అఫైర్‌ నడిపించాడు అంటూ మీడియాలో ఎక్కువ శాతం వార్తలు విన్నాం. ముఖ్యంగా త్రిషను రానా పెళ్లి చేసుకోవడం ఖాయం అన్నంతగా ప్రచారం జరిగింది. కాని అవన్ని పుకార్లే అంటూ వారిద్దరు కొట్టి పారేశారు. ఇన్నాళ్లు మోస్ట్‌ ఎలిజబుల్‌ బ్యాచిలర్‌ అంటూ పిలిపించుకున్న రానా ఇటీవల మిహిక బజాజ్‌ ను ప్రేమ వివాహం చేసుకున్నాడు. కరోనా లాక్‌ డౌన్‌ టైమ్‌ లో అతి తక్కువ మంది సమక్షంలో వీరి పెళ్లి జరిగి పోయింది.

పెళ్లి తర్వాత మొదటి సారి ఒక ఇంటర్వ్యూలో పలు ఆసక్తికర విషయాలను రానా వెళ్లడించాడు. ముఖ్యంగా తన అఫైర్స్‌ మరియు హెల్త్‌ విషయమై మీడియాలో వచ్చిన వార్తలపై ఆయన స్పందించాడు. ఆ పుకార్ల విషయంలో మిహిక స్పందన ఎలా ఉంటుంది అంటూ ప్రశ్నించగా ఆమె ముంబయి హైదరాబాద్‌ లో పెరిగిన అమ్మాయి. ఇలాంటి విషయాల్లో ఆమెకు పూర్తి అవగాహణ ఉంది. ఈతరం యువత గురించిన క్లారిటీ ఆమెకు ఉన్న కారణంగా నాపై మీడియాలో వచ్చిన వార్తలు అన్నింటిపై ఫుల్‌ క్లారిటీతో ఉంది. నా ఆరోగ్యం విషయంలో కూడా పుకార్లను చూసి భయపడకుండా క్లారిటీతో ఉంది. ఆమెకు నా ఆరోగ్యం విషయమై ఎలాంటి ఆందోళన లేదు అంటూ రానా క్లారిటీ ఇచ్చాడు.
Tags:    

Similar News