మంచి కథల్ని చెప్పే టైమ్ వచ్చిందన్న రానా
రానా దగ్గుబాటి నటించిన `అరణ్య` మిశ్రమ స్పందనలు అందుకున్న సంగతి తెలిసిందే. అరణ్య తమిళంలో `కందన్` పేరుతో రిలీజైంది. ముంబై మహారాష్ట్రలో కరోనా కేసుల వల్ల హిందీ వెర్షన్ `హాథీ మేరా సాథీ` రిలీజ్ కాలేదు. తాజాగా రానా మీడియా చాట్ లో మాట్లాడుతూ.. తన కెరీర్ 11 ఏళ్ల జర్నీ గురించి చెప్పిన ఓ మాట ఆసక్తిని కలిగించింది.
లీడర్ చిత్రంతో నేను పరిశ్రమలోకి వచ్చినప్పుడు అసలు ప్రత్యామ్నాయాలనేవి లేవు. మాకు మెయిన్ స్ట్రీమ్ సినిమా మాత్రమే ఉంది. ఎంచుకోవడానికి చాలా తక్కువ ఆప్షన్లు మాత్రమే ఉండేవి. నేను రెగ్యులర్ లవ్ స్టోరీస్ చేసే వ్యక్తిని కాదు. కాలేజీకి వెళ్ళలేదు కాబట్టి ఎప్పుడూ కాలేజీ కథలకు కనెక్ట్ కాలేదు. ప్రతీకారం.. యాక్షన్ లాంటి రెగ్యులర్ కథలు నచ్చవు`` అని రానా చెప్పారు.
అలాగే ఏదైనా సినిమాకి అంగీకరించేప్పుడు భాష అడ్డంకి అని భావించను. చివరికి నా కంఫర్ట్ జోన్ లో ఈ రోజు నేను ఉన్న చోట ఉండిపోయానంతే! అని కూడా తెలిపారు.తెలుగు-తమిళం-హిందీ చిత్రసీమలకు రానా సుపరిచితుడు. బాలీవుడ్ లో దమ్ మారో దమ్-బేబీ-డిపార్ట్ మెంట్- యే జవానీ హై దీవానీ-హౌస్ ఫుల్4 -వెల్ కమ్ టు న్యూయార్క్ .. లాంటి చిత్రాల్ని చేశాడు.
బాహుబలి తో అన్ని భాషల్లోనూ గుర్తింపు దక్కింది. ఇప్పుడు నాకు తమిళం- తెలుగు- మలయాళం- హిందీ అనే ఆప్షన్లు చాలా ఉన్నాయి. నాకు అన్ని భాషలకు సరిపడే కథలు వస్తాయి. మనం ఎవరైనా మంచి కథను చెబితే అన్నిచోట్లా చూస్తున్నారు. తెరపై కొత్త కథలు చెప్పడానికి ఇదే మంచి సమయం అని రానా అభిప్రాయపడ్డారు.
రానా నటిస్తున్న హిరణ్య కసిప చక్కని పురాణేతిహాసానికి చెందిన కథ. ఇది భాషతో సంబంధం లేకుండా అన్ని చోట్లా రిలీజ్ చేయవచ్చు. అలాగే విరాఠ ఫర్వం తెలుగు-తమిళంలో రిలీజ్ కానుంది. రానా లీడర్ తో పరిచయం అయ్యే నాటికి అన్ని ఆప్షన్స్ లేవు. మార్కెట్ పరంగానూ ఇప్పుడు బోలెడన్ని ఆప్షన్లు ఉన్న సంగతి తెలిసినదే.