ఈ మూడు తర్వాతే బాహుబలికి రాణా
బాహుబలి మూవీ ది బిగినింగ్ తర్వాత అత్యంత బిజీగా మారిపోయినది ఎవరయ్యా అంటే.. భల్లాలదేవుడు దగ్గుబాటి రాణా అని చెప్పాలి. బాహుబలిలో చేసినది విలన్ రోల్ అయినా.. పలు భాషల నుంచి హీరో - విలన్ రోల్ ఆఫర్స్ విపరీతంగా వస్తున్నాయి. బాహుబలి సీక్వెల్ షూటింగ్ లో రాణా జాయిన్ అయేందుకు ఇంకా టైం ఉంది. దీంతో ఇతర ప్రాజెక్టులు చకచకా కంప్లీట్ చేసేస్తున్నాడు రాణా. ప్రస్తుతం గాజీ అనే చిత్రంలో నటిస్తున్నాడు.
మన దేశంలో సబ్ మెరైన్ థీమ్ తో వస్తున్న మొదటి మూవీ ఇదే. పీఎన్ ఎస్ గజినికి సంబంధించిన నిజ జీవిత గాధ ఇది. దీన్ని కంప్లీట్ చేస్తూనే.. తర్వాతి వెంచర్ కు కూడా గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు. కొరియోగ్రాఫర్ ప్రేమ్ రక్షిత్ డైరెక్షన్ లో రాణా ఓ మూవీ చేయనున్నాడని తెలుస్తోంది. గాజీ తర్వాత ఇదే సెట్స్ పైకి వెళ్లే ఛాన్స్ ఉంది. దీని తర్వాతి ప్రాజెక్ట్ ని కూడా రాణా ఫైనల్ చేస్తున్నాడనే టాక్ వినిపిస్తోంది. తమిళ్ - తెలుగు భాషల్లో తెరకెక్కనున్న ద్వి భాషా చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇవ్వాలని ఈ దగ్గుబాటి హీరో భావిస్తున్నాడట. పరుత్తి వీరన్ - మౌనం పేసియాదే వంటి డిఫరెంట్ సినిమాలతో అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ గా గుర్తింపు పొందిన డైరక్టర్ అమీర్.. రీసెంట్ గా ఓ ప్రాజెక్ట్ కోసం రాణాని సంప్రదించాడు. రాణాతోపాటు ఆర్యకు కూడా ఓ స్టోరీ లైన్ ని వినిపించాడట.
ఈ కాన్సెప్ట్ విపరతీంగా నచ్చేసిన ఈ ఇద్దరు హీరోలు.. అమీర్ కోసం తమ డేట్స్ ని అడ్జస్ట్ చేసుకుంటున్నారని తెలుస్తోంది. ఈ మూవీ వచ్చే ఏడాది మధ్యలో ప్రారంభమై... చివరి నాటికి రిలీజ్ అయ్యేలా ప్లాన్ చేస్తున్నారని సమాచారం. చూస్తుంటే.. రాణా ఇప్పుడు ఫుల్ పేస్ లో ఉన్నాడని అనిపిస్తోంది కదూ. !