ఫస్ట్ లుక్: 'ఎల్టీటీఈ' అంటున్న రానా

Update: 2018-08-14 06:30 GMT
ఈ రానా దగ్గుబాటి ఉన్నాడే వాళ్ళ తాతగారైన రామానాయుడు పేరుని నిలబెట్టేలా ఉన్నాడు.  అయన అత్యధిక భాషలలో సినిమాలు నిర్మించడమే కాకుండా, వందకు పైగా సినిమాలు నిర్మించి గిన్నిస్ రికార్డ్ సాధించాడు.  ఇప్పుడు ఈ మనవడు అన్నీ భాషల సినిమాల్లో నటించి గిన్నిస్ రికార్డు సాధిస్తాడో ఏమో!

ఇప్పటికే తెలుగు, తమిళం, హిందీ సినిమాల్లో నటించాడు. ఒక ఫారిన్ లాంగ్వేజ్ సినిమాకోసం రానా ను ముఖ్య పాత్ర కోసం సంప్రదించారని ఇదివరకే వార్తలు వచ్చాయి. ఇప్పుడు తాజాగా కన్నడ సినిమాలో నటిస్తున్నాడట.  'ఎల్టీటీఈ' అనే పేరుతో తెరకెక్కనున్న ఈ సినిమాకు AMR రమేష్ దర్శకత్వం వహిస్తాడట. ఈ సినిమా షూటింగ్ జనవరిలో ప్రారంభం అవుతుందని డైరెక్టర్ తెలిపాడు.  ఈ సినిమా ఫస్ట్ లుక్ ను కూడా విడుదల చేయడం విశేషం.  'ఎల్ టీ టీ ఈ' అంటే తెలుసు కదా.. 'లిబరేషన్ టైగర్స్ ఆఫ్ తమిళ్ ఈలం'. శ్రీలంకలో తమిళులకు ప్రత్యేక దేశం కావాలని హింసాయుత పోరాటం చేసిన సంస్థ.  దీంతో ఆ థీమ్ కు తగ్గట్టే ఫస్ట్ లుక్ ను శ్రీలంక మ్యాప్ తో పాటు ఎరుపు - నలుపు లో ఇంటెన్స్ గా డిజైన్ చేశారు.

'వన్ మాన్స్ టెర్రరిస్ట్ ఈజ్ అనదర్ మ్యాన్స్ ఫ్రీడం ఫైటర్' అనేది సినిమా ట్యాగ్ లైన్... అంటే 'ఒకరికి టెర్రరిస్ట్ గా అనిపిస్తే మరొకరికి అతను ఫ్రీడం ఫైటర్'.  ఈ సినిమాలో రానా ఒక టెర్రరిస్ట్ పాత్రలో కనిపిస్తాడట.  విజేత పిక్చర్స్ - సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్ లు ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.
Tags:    

Similar News