ఫన్నీ: బాహుబలికి వధువు కావలెను

Update: 2016-01-21 10:42 GMT
ఎట్టకేలకు ఈ ఏడాది ప్రభాస్ పెళ్లి అయిపోయేలా కనిపిస్తోంది. ఈ సంవత్సరమే పెళ్లి చేసుకుని తీరతానని పెదనాన్నకు మాట కూడా ఇచ్చేశాడు ప్రభాస్. మంచి సంబంధం కోసం చూస్తున్నట్లు కూడా చెప్పారు కృష్ణం రాజు. ఐతే ఆ సంబంధం చూడటానికి తన వంతు సాయం చేస్తున్నాడు దగ్గుబాటి రానా. ‘బాహుబలి’ సినిమాలో భల్లాలదేవుడిగా ప్రభాస్ ను ఢీకొట్టిన రానా.. తన మిత్రుడి కోసం తనదైన శైలిలో ఓ సరదా పెళ్లి ప్రకటన కూడా ఇచ్చాడు. ఇప్పుడా ప్రకటన సోషల్ మీడియాలో హట్ టాపిక్ అవుతోంది.

యుద్ధ వీరుడు - సంచార నాయకుడు అయిన బాహుబలి అనే యోధుడి కోసం వధువు కావాలంటూ ఇచ్చిన ఆ ప్రకటనలో బాహుబలి గుణగణాల గురించి సరదాగా వర్ణించారు. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తుంటాడని.. బలిష్టంగా ఉంటాడని.. ఇంటి పనుల్లో బాగా సాయ పడతాడని.. నచ్చిన అమ్మాయి కనిపిస్తే కొండలు గుట్టలు ఎక్కేస్తాడని, అలాగని అమ్మాయల వెంట పడే ఆకతాయి కాదని, వధువుకు మేకప్ కూడా తనే వేయగలడని పేర్కొన్నాడిందులో రానా.

అలాగే బాహుబలిని పెళ్లి చేసుకోవాలనుకునే అమ్మాయికి ఉండాల్సిన లక్షణాలు కూడా వర్ణించాడు. ఆ అమ్మాయికి కత్తి యుద్ధం తెలిసి ఉండాలని.. బాహుబలితో కలిసి కొండల్లో గుట్టల్లో, మంచు పర్వతాల్లో విహరించాల్సి ఉంటుందని పేర్కొన్నాడు. రానా చమత్కారమంతా ఈ ప్రకటనలో దర్శనమిస్తోంది. ‘బాహుబలి’ సినిమాతో ఐడెంటిఫై అయిన జనాల్ని ఈ ప్రకటన భలే ఆకట్టుకుంటోంది.
Tags:    

Similar News